(దండుగుల శ్రీనివాస్)
సిరిసిల్లా కలెక్టర్ రివేంజ్ పాలిటిక్స్‌లో తను ఓ భాగమయ్యాడు. తనే మెయిన్ రోల్ పోషిస్తూ వివాదాలకు కేరాఫ్‌గా నిలిచాడు. బీఆరెస్ సర్కార్‌లో తనకు ప్రయార్టీ దక్కలేదనే అక్కసుతోనే ఇదంతా చేస్తున్నాడనే ప్రచార నేపథ్యం.. ఆయన చేస్తున్న పనులతో అవుననే అనిపించేలా ఉన్నాయి. కేటీఆర్‌ను టార్గెట్ చేసి ఆ జిల్లా కేంద్రంగా నడుస్తున్న రాజకీయాలను స్వయంగా ఓ కలెక్టరే నిర్వహించడం ఇప్పుడు వివాదమైంది. ఇలాంటి వివాదస్పద కలెక్టర్‌ను సర్కార్ చూసీ చూడనట్టు వదలేయడం… ఏం జరుగుతుందో చూద్దాం అని వేడుక చూడటం మరింత నష్టం కలిగించే అంశం. కేటీఆర్‌పై రేవంత్‌కు పగ.. సేమ్ కలెక్టర్‌కు కూడా.
ఇప్పుడు సీఎం రేవంత్ ప్రోద్బలంతోనే ఇదంతా కలెక్టర్ చేస్తున్నాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ఓ చాయ్ బండీ నడిపంచుకునే వాడి మీద కలెక్టర్ ప్రతాపం చూపడం ఆయన మనస్తత్వాన్ని పట్టిస్తోంది. రెవెన్యూ సెక్షన్‌లో కూడా ఆ కలెక్టర్‌పై ఒక్కరంటే ఒక్కరు కూడా మంచి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. పగబడ్డాడంటే అంతే. వదిలేది లేదు. వేధించి సాధిస్తాడు. ఇది నేనంటున్న మాట కాదు. స్వయంగా కలెక్టరేట్‌లోని ఉద్యోగులు. రెవెన్యూ శాఖ అధికారులు. చాయ్‌బండీ తీయించడమే కాక.. ఎన్నికల కోడ్ అతిక్రమించాడని కేసు నమోదు చేయిచండం కలెక్టర్ కక్ష సాధింపు చర్యకు పరాకాష్ట. కలెక్టర్ భార్య అతనిపై ఫిర్యాదు చేసిందని బీఆరెస్ తెగ వైరల్ చేసింది. దీనిపై ఆయన మీడియాపై కూడా కత్తి గట్టాడు.
వాస్తవానికి ఆరు నెలల క్రితం కలెక్టర్ పై అతని భార్యఫిర్యాదు విషయాన్ని అక్కడి ఉద్యోగులే ధ్రువీకరిస్తున్నారు. దీన్ని బీఆరెస్ ఇప్పుడు దీన్ని అందివచ్చిన అవకాశంగా భావించి కలెక్టర్ పర్సనల్ ఇష్యూన తెరపైకి తెచ్చి వైరల్ చేశారు. ఇంత జరిగిన సీఎం కిమ్మనలేదు.