(దండుగుల శ్రీ‌నివాస్‌)

సీన్ రివ‌ర్స్ అయ్యింది. అప్పుడు మీడియాను గుప్పెట్లో పెట్టుకుని అంతా తానై న‌డిపించిన కేసీఆర్‌ను ఇప్పుడా మెయిన్ మీడియా ఒంట‌రిని చేసింది. ప‌ట్టించుకోలేదు. స్పేస్ ఇవ్వ‌లేదు. ఏదో అలా రాశామా అంటే రాశాం అని చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. ఏడాది త‌రువాత ఫామ్‌హౌజ్ వీడి బ‌య‌ట‌కు వ‌చ్చిన కేసీఆర్ పిలుపును, మాట‌ల‌ను అస్స‌ల్ ప‌ట్టించుకోలే. ఇప్పుడా మీడియా రేవంత్ పాట పాడుతున్నాయి. అంతేగా.

20Vastavam.in (3)

ఏ ఎండ‌కాగొడుగు. ఆనాడు కేసీఆర్ చెప్పుచేత‌ల్లో ఉన్న మీడియా ఇవాళ రేవంత్ గుప్పిట్లో ఉన్నాయి. ఇదే అంశంపై బీఆరెస్ సోష‌ల్ మీడియా మీడియాపై ప‌డింది. (దీనిపై వాస్త‌వం టీవీలో ఓ స్టోరీ రాబోతుంది) ప్ర‌జాస్వామ్యానికి ఇది సిగ్గుచేట‌ని మండిప‌డుతున్నాయి. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, వెలుగు పేప‌ర్లు కాంగ్రెస్‌కు క‌ర‌ప‌త్రాలుగా మారాయ‌నేది వారి వాద‌న‌. సాక్షిలో కేసీఆర్ వార్త కు కొంచెం క‌వ‌రేజీ దొరికింది.