(దండుగుల శ్రీనివాస్)
దిశ వెబ్ సైట్‌లో ఇవాళ ఓ వార్తొచ్చింది. కేసీఆర్ ఏనాడో కింద పడి కాలు విరిగి కట్టె సాయంతో నడిచే ఫోటోలు.. ఆనాటి పరిస్థితులు. ఇప్పుడే ఇది ఎందుకు..? రేవంత్ అన్నాడు… ఏమని నువ్వు ముందు కట్టె లేకుండా నడువు.. మమ్మలి కొట్టడం తరువాత అని. దీనికి సపోర్టుగా ఈ వార్త అన్నమాట. మరీ దిగజారుడు అవసరం లేదు సోకాల్డ్. విమర్శించాలంటే చాలా చాలా అంశాలే ఉన్నాయి కేసీఆర్ గురించి. ఒక్కటి కాదు వంద వార్తలు రాయొచ్చు. కేసీఆర్ దురాగత పాలన గురించి. నియంత పోకడల గురించి. కానీ ఇలా నువ్వు చీప్‌గా చిల్లరగా ఈ వార్త పెట్టి దీని వల్ల వచ్చే వ్యూస్ తో రాబడి గురించి ఆలోచించే కుంచిత మనస్తత్వం ఉంటే దిగజారినట్టే అర్థం.
అసలు ఆ వార్తలో ప్రస్తుత పరిస్థితుల గురించి ఏమైనా విరవించావా..? కేసీఆర్ బాజాప్తా బద్దం తింటున్నాడు. తిరుగుతున్నాడు. తన ఫామ్‌హౌజ్‌లో. ఏకంగా కారు నడుపుతూ వచ్చిన వీడియోను కూడా బీఆరెస్ శ్రేణులు పోస్ట్ చేశారు. చూశావా.. మావోడు కట్టెతో నడవడం కాదు.. ఏకంగా కారే నడుపుతున్నాడు రేవంత్….! అని చెప్పేందుకు. ఇప్పుడు ఈ దిశ.. దశాదిశా లేకుండా సోయిసోక్కు లేకండా కట్టె పట్టుకుని నడుస్తున్న కేసీఆర్ ఫోటోలు పెట్టి ఆనాటి పరిస్థితులు మళ్లోసారి గుర్తు చేసి ఏం చెప్పాలనుకుంటున్నావు. కేసీఆర్ ఇప్పటికీ నడవలేని స్థితిలో ఉన్నాడని. జనం వెర్రిపుష్పాలు మరి. నువ్వేది చెబితే అది నమ్మేయడానికి. కనీసం బయటకైనా మోరల్స్ కనిపించేలా నటించాలి కదా కామ్రేడ్.