(దండుగుల శ్రీనివాస్)
అసలే ఈగో. అధికారం పోయిందనే అక్కసు. రేవంత్‌ను కలలో కూడా సీఎంగా ఊహించని మనస్తత్వం. తను మాజీగా ఫామ్‌హౌజ్‌కే పరిమితమైతానని ఊహకు అందని నిజం. ఇవన్నీ కేసీఆర్ అనుభవించాడు. భరించాడు. బిగపట్టుకున్నాడు. జనాలపై కసితో రగిలిపోయాడు. చావండిరా. మీరు చస్తే చూడాలి. అప్పుడు పగ తీరాలి. అనే రేంజ్ లో ఫామ్‌హౌజ్ కే పరిమితమయ్యాడు. పడుకున్న పామును పడుకోనివ్వకుండా ఇగ వస్తలేడు.అగ వస్తలేడు. ఆడ్నే పంటుండు. ఇదేనా జనాలకు ఇచ్చి మర్యాద. ఇదేనా ప్రతిపక్ష నాయకుడిగా నీ గౌరవం. అంటూ మాట్లాడతందుకు ఏమీ లేని రేవంతు ఏడ బోయినా ఇవే స్పీచులు.
కేసీఆర్ ఈగోను మరింత చంపి చంపి చంపి కైమ కైమ చేసి పైశాచికానందం పొందేందుకు ఎంతో ఉబలాటపడ్డాడు. ఏడాది గడిచింది. కేసీఆర్ సంతృప్తి పడ్డాడు. పగ తీరింది. జనాలు గగ్గోలు పెడుతున్నారు. ఎంత అహంకారివైనా నువ్వే బెటరంటున్నారు. నియంత పాలనే జర నయమనే పరిస్థితికి వచ్చారు. ఇది కదా నేను కోరుకుంది అనుకున్నాడు. ఇగ బయటకు వస్తానంటున్నాడు. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెడ్తానంటున్నాడు. తను దెబ్బ కొడితే అంత ఆశామాషీగా ఉండదు మీకు తెలుసు కదా. అని గతం గుర్తు చేస్తున్నాడు. అవును .. పక్కా తెలుసు. బీఆరెస్ శ్రేణులకు. ఉద్యమకారులకు. నిన్ను నమ్ముకుని జీవితాలు అర్పించినవారికి. అందరికి. అందరికీ తెలుసు.
నీ గురించి. ఇప్పుడు తెలవాల్సింది రేవంత్‌కు. పథకాలు అమలు చేయలేక, ఇచ్చిన హామీల మాట నిలబెట్టుకోలేక.. కేసీఆర్ మీద పడి పడీ ఏడ్చి.. రా బయటకు రా.. రావా.. ! చూశారా రానంటున్నాడు. ఇంతటి బేవార్సు లీడర్ మరొకడుంటాడా..? అని కంఠశోష వచ్చేలా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. పైన తథాస్తు దేవతలుంటారట కదా. ఇగో ఇప్పుడు ఇలా బయటకు వస్తానంటున్నాడు. ఫిబ్రవరి మంత్ ఎండింగ్ ముహూర్తమట. ఇగ కాస్కో.
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి నిన్నటి వరకు. అప్పుల చిప్ప పట్టుకుని ముప్పు తిప్పలు పడైనా పథకాలు అమల్లోకి తెచ్చే పని ఇగ షురూ చేపిస్తడన్నమాట. సేమ్ పాలన. అప్పులు తప్పవు. జనాల చెవిలో అవే పువ్వులు. అధికారం కోసం పాకులాడే మీరిద్దరు ఒకరికి మంచి మరొకరు. ఇద్దరూ ఇద్దరే.