(దండుగుల శ్రీనివాస్)
మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు సీఎం రేవంత్‌ను ఆమాంతం ఆకాశంలోకెత్తేశాడు. ఆయన రాసిన ఉనిక పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా రేవంత్ హాజరయ్యాడు. ఈ సందర్బంగా మాట్లాడిన విద్యాసాగర్ రావు.. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో ఈ మూడింటిని మెచ్చుకున్నాడు. హైడ్రా స్టార్ట్ చేసినప్పుడు పార్టీల వారీగా దీన్ని మంచిదా.. చెడ్డదా అని చెప్పడంలో వెనుకామందాయ్యారన్నాడు. వాస్తవానికి మంచిని మంచి.. చెడును చెడు అనొచ్చు. కానీ. ఇక్కడ పార్టీలు వెనుకామందుదాయి.. నాకైతే హైడ్రా చాలా మంచి పనే అనిపించిందన్నాడు. పరోక్షంగా బీజేపీ ఈ విషయంలో స్పష్టత నివ్వలేకపోయిందని, బీజేపీ నేతలు తలోమాట మాట్లాడారనే విషయం ఆయన మాటల ద్వారా వ్యక్తమయ్యింది.
ఇక మూసీ పునరుజ్జీవం గురించి కూడా విద్యాసాగర్ రావు మాట్లాడారు. ఇది చాల మంచి పని అని కితాబునిచ్చాడు సీఎంకు. దీంతో పాటు ఆయన ప్రత్యేకంగా మెచ్చుకున్నది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు గురించి. దీని వల్ల ఎంతో మంది నిరుద్యోగులకు మేలు జరుగుతుందని, మంచి ప్రమాణాలు, నాణ్యతతో కూడా విద్య దొరికి, ఉపాధి అవకాశాలు మెరుగ్గా లభ్యమవుతాయని ఆయన చెప్పుకొచ్చాడు. ఇది ఇక్కడ సక్సెసయితే దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలుస్తుందని అభిప్రాయపడ్డాడు. ఇది కూడా ఇప్పుడు బీజేపీలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఆల్టర్నేట్ పార్టీగా బీజేపీ ఎదిగేందుకు నానా తంటాలు పడుతుంటే ఈయన ఇలా రేవంత్‌ను, కాంగ్రెస్ సర్కార్‌ను మెచ్చుకుని పోవడం ఏంటనే డిస్కషన్ కమలనాథుల్లో నడుస్తున్నది.