(దండుగుల శ్రీనివాస్)
ఇలాగే ఉంది కేటీఆర్ పరిస్థితి. ఫార్ములా- ఈ కార్ రేస్ కేసులో అసలేం లేదంటాడు. కానీ ఆ తతంగమంతా అధికారులు చూసుకోవాలి కదా అని నాలుక మడత పెడతాడు. తాజాగా మళ్లీ ఇదే విషయాన్ని వల్లెవేశాడు. అదో లొట్టపీసు కేసన్నాడు. మరి ఈడీ ఎందుకు పిలిచిందో. వెళ్తానో లేదో మా లాయర్లను అడిగి చెబుతానంటున్నాడు.
కవిత కూడా ఇట్లనే అన్నది. జైలు ఊచలు లెక్కించి.. బోరున ఏడ్చి వడ్డీతో సహా చెల్లిస్తా అని శపథం పూనింది. వడ్డీతో సహా చెల్లించాల్సింది కార్యకర్తలకు, ఉద్యమకారులకు. మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలంటే వారికి వడ్డీతో సహా చెల్లించుకోవాలి.. సరే ఆ టాపిక్ వదిలేద్దాం. కేటీఆర్‌కు ఓ పక్క భయం.. ఓ పక్క తప్పించుకునే దోరణిలో వెతుకులాట.. ఇవన్నీ కలిసి అతడిలో మేకపోతు గాంభీర్యం స్పష్టంగా కనిపిస్తుంది.
కొత్త ఏడాదిలో సీఎం కొత్త మోసాలు చేసి ప్రజలను మభ్యపెడతాడని కూడ అంటున్నాడు. ప్రజలేమన్నా అంత పిచ్చోళ్ల. మీ అహంకారానికి పాతరేసే కాంగ్రెస్‌కు పట్టం గట్టారు. అక్కడా అదే రిపీట్ అయితే వాళ్లకూ అదే గతి పడుతుంది. డౌట్‌లేదు. మధ్యలో బీజేపీ నెత్తిన పాలు పోసిన వారవుతారు మీరిద్దరు.