(దండుగుల శ్రీనివాస్)
కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తనకు అలవాటైన దోరణిలో ఈసారీ తిట్ల దండకం ఎత్తుకున్నారు. ఓ వైపు కేటీఆర్ అక్కడ మహబూబ్‌నగర్ రైతు ధర్నాలో సీఎంను ఏకవచనంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. ఆ తరువాత తన నివాసంలో జరిగిన సీఎం ప్రెస్‌మీట్‌లో రేవంత్‌రెడ్డి కేటీఆర్‌ను బాగానే అర్సుకున్నారు. కరిచేశారు. అదానీ స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన వంద కోట్లు మాకొద్దు అంటూ లేఖ రాశామని చెప్పడం ప్రెస్‌మీట్ ముఖ్యోద్దేశం.
ఈ మీటింగులోనే కేటీఆర్ అదానీని కలిసిన ఫోటోను బహిర్గతం చేసి సిగ్గులేనోడు అని సంబోధించారు. ఆ తరువాత ఓ విలేకరి లగచర్ల విషయాన్ని ప్రస్తావించి.. అక్కడ ఫార్మా విలేజ్ ఏర్పాటు చేస్తున్నారని కేటీఆర్ అంటున్నారని, మీరేమో ఇండస్ట్రియల్ కారిడార్ అని మాటమార్చారంటున్నారని గుర్తు చేయడంతో కస్సుమన్నారు సీఎం.
ఏ వాడో పిచ్చోడు.. ఆ మాటల్ని మీరెందుకు సీరియస్‌గా తీసుకుంటుడ్రు బై.. వదిలేయుండ్రి… వాడి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. బయటకు వచ్చి నాకు ఫోన్లు చేస్తున్నారని సీఎం అనడంతో అంతా ఘోల్లుమన్నారు. ఇక చివరగా సైకో రాముడు అని కొత్త బిరుదిచ్చాడు సీఎం. సైకో రాముడు..ఇక ఈ పేరు ఫిక్స్ చేసుకోండని మీడియాకు స్పష్టం చేయడం చర్చకు తెరదీసింది.