(దండుగుల శ్రీనివాస్)
తన వెన్నంటే ఉండే సంతోష్‌రావును బయటకు పంపించేశాడు కేసీఆర్. పార్టీకి, వ్యక్తిగతంగా తమకు నష్టం వాటిల్లేలా ప్రవర్తించిన, వ్యవహరించిన లిస్టొకటి రెడీ చేసుకుంటున్నాడట కేసీఆర్. ఆ జాబితాలో రాసుకున్న పేర్ల లో గెంటేవేతకు గురైనవాడిలో సంతోష్ ఒకడు. తనకు మందులు, మాకులు వేయడానికి ఒకరుండాలె కదా.. అందుకే రాజ్యసభకు పంపుతున్నాననే విధంగా మాట్లాడిన కేసీఆర్.. ఇప్పుడు ఈయన అవసరం లేదనుకున్నాడు. కేసీఆర్ అంతే. ఎవర్నెప్పుడు నెత్తిన పెట్టుకుంటాడో.. ఆ తరువాత వారిని ఎలా కాలదన్ని గెట్‌వుట్ అంటాడు.. ఏక్షణం ఎలా ఉంటాడో తెలియదు.
ఆయనకు అత్యంత సన్నిహితంగా అప్పట్నుంచి మెలిగిన వారు ఇప్పటికీ అంటి పెట్టుకుని ఉన్నవారు చాలా చాలా తక్కువ. అంతే కేసీఆర్ నమ్ముకుంటే నట్టేట ముంచుతాడ్రో అంటారు గెంటివేతకు, అవమానానికి గురై బయటకు వెళ్లినవారు. అందులోనే ఉండి రోజురోజుకూ చచ్చీబతికేవాళ్లు. సరేగానీ ఈ లిస్టు రాయాలంటే వారినందరినీ బయటకు పంపాలంటే ఓడిన మాజీ ఎమ్మెల్యేలనందరినీ పంపాలి మరి. పంపుతావా..?