వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌పై భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి, డీజీపికి ఫిర్యాదు చేశారు. చ‌ట్ట‌ప‌రంగా ఈ ప‌త్రికపై చ‌ర్య తీసుకోవాల‌ని కోరారు. పండుగ రోజు కూడా ప్ర‌భుత్వంపై విష ప్ర‌చారం చేస్తున్న న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక స్వేచ్చ‌ను అడ్డం పెట్టుకుని అవాస్త‌వాలు రాస్తూ ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించేందుకు య‌త్నిస్తున్న‌ద‌ని తీవ్రంగా మండిప‌డ్డారు.

ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన వార్తా కథనం రాసిన నమస్తే తెలంగాణ దినపత్రికపై తగిన చర్యలు తీసుకోవాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి X వేదికగాముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డీజీపీ జితేందర్ గారికి ట్విట్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేయాలని కోరారు.

మీడియా స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై బురదజల్లుతు,ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇటువంటి వార్తలు రాస్తున్నారని ఇలాంటి తప్పుడు వార్తలు రాయకుండా చూడాలని, అసత్య వార్తలు రాసిన పత్రిక పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

చిత్తశుద్ధితో పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఫోర్త్ సిటీ తో ఒక అద్భుతమైన నగరంగా హైదరాబాద్ ను ఈస్ట్ సైడు అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. గత పది ఏండ్లు పాలించిన BRS హయాంలో జరగని అభివృద్ధి, ఈ పది నెలల్లోనే మా ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్వలేక ఇటువంటి విష ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్న పత్రిక పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈరోజు పండుగ కావడంతో ఆగానని, రేపు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని అన్నారు.