(దండుగుల శ్రీనివాస్)
కేటీఆర్ కామెంట్లు, విమర్శలు… హరీశ్ విసుర్లు, కౌంటర్లు… వింటుంటే.. టీవీలో చూస్తేంటే నాకు నవ్వొస్తుంది. ఏవగింపు కలుగుతది కూడా ఒక్కోసారి. రాష్ట్రం ఏర్పడి పరిపాలన చేతిలోకి రాగానే.. నేనే మేధావి అనే రేంజ్‌లో పరిపాలించి బొక్క బోర్లా పడ్డ కేసీఆర్ వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టమే మిగిలింది. అప్పులపాలు చేసి దేశంలో నెంబర్ వన్ మనమే అని మీడియాలో గగ్గోలు పెట్టి జనాలను పక్కదోవ పట్టించి డైవర్ట్ పాలిటిక్స్‌లో ఆరి తేరిన కేసీఆర్.. ఇప్పుడు ఫామ్ హౌజ్ ప్రజలు వేసిన శిక్షను అనుభవిస్తున్నాడు. కానీ జనాలను మాత్రం అప్పుల ఊబిలో ముంచిపోయాడు.
ఉద్యమం సమయంలో అందరి అవసరం కావాలి…. అందరి సహకారం ఉండాలె.. వారి ప్రాణార్పణలు, ఉద్యమ నినాదాలు కేసీఆర్‌కు కలిసి వచ్చాయి. అదంతా నాదే.. నావల్లే అనే పేటెంట్ హక్కుగా తెలంగాణపై పెద్దరికం సాధించుకున్నాడు. ఈ విషయంలో చంద్రబాబుకు, కేసీఆర్‌కు చాలా దగ్గర పోలికలే ఉన్నాయి. నేనే.. నావల్లే.. నేను లేకుంటే.. నేను కారణ జన్ముడిని…ఇగో ఇలా ఇగోలతో పరిపాలన చేసి చంక నాకిచ్చాడు కేసీఆర్. రైతుబంధు పేరుతో ఓటు బ్యాంకు రాజకీయం.. అసలు ఓటు బ్యాంకు రాజకీయం చేయనిదెన్నడు..? ప్రజలు వెర్రి గొర్రెలనుకున్నాడు. తను ఏది చెబితే వారికి అదే వేదం అని భ్రమపడ్డాడు.అసలు తనకు మించిన సీఎం.. తనలాంటి లీడర్ తెలంగాణ ప్రజలకు దొరకడం వారి అదృష్టమని కూడా అనుకున్నాడు. ఇప్పుడ ఫామ్ హౌజ్‌లో పన్నాడు.
ఓ దళితబంధు అట్టర్ ఫ్లాప్ పథకం.. దేశంలో చక్రం తిప్పుతానని ఎగేసుకుపోయి.. ఇక్కడేదో దళితుందరినీ ఉద్దరించానని చెప్పడానికి .. చూశావా ఒక్కో దళిత కుటంబానికి నేను పదిలక్షలిస్తున్నాను.. మీరిస్తున్నారా..? అని ఎగతాళి, పరాష్కం, అహంకారం చూపించాలని అనుకున్నాడు. ఇదో పనికి మాలిన పథకం… బీఆరెస్ లీడర్లు దోచుకుతిన్నారు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తేనే. కీర్తి ఖండూతితో ఇబ్బడి ముబ్బడిగా ఏది తోస్తే అది పథకం కింద తోసేసి కనీసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది…? అన్నిరంగాలకు మేలు జరుగుతున్నదా..? అన్ని కులాలు అభివృద్ది చెందుతున్నాయా… ? అభివృద్ధి పనులకు నిధులు ఉన్నాయా..? ఏవేమీ ఆలోచించలేదు.. పట్టించుకోలేదు.. ఎడాపెడా చెడామడా ఏవేవో పనికి మాలిన పథకాలు ప్రవేశపెట్టాడు కేసీఆర్. టెండర్లుంటాయి.. పనులుంటాయి..
కానీ వాటిని చేసే వారుండరు. చేస్తే బిల్లులు రావు.. ఇప్పుడ సర్పంచులు రోడ్డెక్కింది అందుకే. అప్పుడే వారికి ఎంతో కొంత చెల్లిస్తూ పోతే ఇప్పటికే క్లియర్ అయ్యేటివి. నిధులు లేవు. పిట్టల దొర లెక్క ఏమాటలంటే ఆ మాటలు చెప్పి జనాల చెవిలో పువ్వులు పెట్టి ఇగ మరో నాలుగు టర్మ్‌లు తను కాకపోతే కొడుకు కేటీఆర్ సీఎంగా ఉండాలని .. తెలంగాణ తమ తాత జాగీరని భావించాడు. ఇప్పుడు కేటీఆర్, హరీశ్ ఇలా రోడ్డెక్కిన వారందరి దగ్గరకు వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు.