(దండుగుల శ్రీనివాస్)
నిబంధనలను సాకు చూపారు. జీవోను అడ్డం పెట్టుకున్నారు. కోట్ల రూపాయల విలువ జేసే ప్రభుత్వ భూమిని కాజేశారు. నకిలీ బిల్లులు సృష్టించి ఇరిగేషన్‌కు చెందిన భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఇప్పుడిదంతా బయటపడింది. ప్రభుత్వం కొరఢా పట్టుకుంది. వెంటనే ప్లాట్లు రద్దు చేశాడు నల్లగొండ జిల్లా కలెక్టర్. ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది. ఇందులోప్రధాన ప్రతికలకు సంబంధించిన అందరు బ్యూరో ఇన్చార్జిలు, స్టాఫ్ రిపోర్టర్లూ ఉన్నారు.
ఓ వైపు హైదరాబాద్‌లో హైడ్రా అక్రమ నిర్మాణలు కూల్చేసి కేసులు పెడుతున్నది. మరి రిపోర్టర్లను ఎందుకు వదలాలి..? సహకరించిన అధికారులపై కేసులేవీ..? ఈ పత్రికల మేనేజ్‌మెంట్ కిమ్మనకుండా ఎందుకుంటుంది…? ఇప్పుడివే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రిపోర్టర్లంతా సిండికేట్‌గా మారి నల్లగొండ జిల్లాలో ఇలా రాజ్యమేలారు. వారి టైమ్ అలా అప్పుడు కలిసి వచ్చింది. అందుకే ఇలా చీట్ చేసి ప్లాట్లు కొట్టేశారు. ఇప్పుడు రద్దు చేయగానే మేమే ఇచ్చేస్తున్నామని ఓ పేపర్ మీద రాసి కొత్త డ్రామాకు తెరలేపారు. ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, వెలుగు, టీవీ9, టీ న్యూస్, ఆంధ్రజ్యోతి.. అంతా ఉన్నారు. సమిష్టిగా సర్కార్ భూమికి ఎసరు పెట్టారు. వీరిపై కేసులు పెట్టి జైలుకు పంపాల్సిందే అంటున్నాయి జర్నలిస్టు సంఘాలు.
సదరు నిందితుల తో పాటు… వారికి సహకరించిన అధికారులపై చర్యలకు ఆయా సంఘాల డిమాండ్…అక్రమాలకు పాల్పడ్డ ఆ ఎనిమిది(8) మంది జర్నలిస్టుల లిస్ట్ 👇
1..జిల్లెపల్లి దత్తురెడ్డి, ఈనాడు పత్రిక బ్యూరో చీఫ్, నల్గొండ జిల్లా (తన భినామీ బడా బిల్డర్ మామిళ్ల రామంజన్ రెడ్డి పేరుతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు)
2. మర్రి మహేందర్ రెడ్డి, నమస్తే తెలంగాణ పత్రిక బ్యూరో చీఫ్, నల్గొండ జిల్లా
3. బూర రాము, Tnews స్టాఫ్ రిపోర్టర్,నల్గొండ జిల్లా
4. ముప్ప రేవన్ రెడ్డి, TV9 స్టాఫ్ రిపోర్టర్, నల్గొండ జిల్లా
5. నారబోయిన క్రాంతి, క్రాంతి పోస్ట్ అనే యూట్యూబ్ ఛానెల్ అధినేత
6. బోయపల్లి రమేష్, R TV స్టాఫ్ రిపోర్టర్, నల్గొండ జిల్లా
7. మారబోయిన మధుసుధన్, నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక బ్యూరో చీఫ్ (ప్రస్తుతం తెలంగాణ డిప్యూటి సీఎం బట్టి విక్రమార్క్ పిఆర్వో)
8. పసుపులేటి కిరణ్ కుమార్, వెలుగు దినపత్రిక బ్యూరో చీఫ్, నల్గొండ జిల్లా