ఏంట్రా ఇంత ఘోరంగా తయారయ్యారు
టాయిలెట్ లలో కెమెరాలేందిరా..
ఏం కనబడిందిరా అమ్మాయిల బాత్రూముల్లో…
పనిచేసుకొనే దగ్గర , కాలేజీల్లో పీరియడ్స్ లో ప్యాడ్లు మార్చుకోవడం ఎంత నరకమో కనబడిందా..
నీళ్లలో ఏరులా పారే రక్తం కనబడిందా
తిన్న ఆహారం తేడా చేస్తే కడుపులో గడబిడ తగ్గించుకునేందుకు బయట పాట్లు ఎన్ననీ..
నీళ్ళు లేని బాత్రూముల్లో టాయిలెట్ కు వెళ్ళడం కుదరక పొద్దంతా నీళ్ళు త్రాగని అమ్మాయిల గురించి తెలుసారా మీకు…
క్లాసుల్లో కూర్చొని పొట్టలు బిగపట్టేస్తే వెళ్ళి రిలీవ్ అవ్వడం అనే బేసిక్ నీడ్ ను కూడా చూసేంత పర్వర్ట్ లుగా మారారెంట్రా ..
టాయిలెట్ కు వెళ్తే ఒకరి చున్నీ ఒకరు పట్టుకోవడానికో, ఒకరి బ్రా స్ట్రాప్ ఒకరు సరిచేయడానికో , నీళ్ళు లేకుంటే ఒక మగ్ నీళ్ళు తెచ్చిపెట్టడంలో సాయానికో అమ్మాయిలు ఒకరికొకరు తోడుగా వెళ్తారు..
ఇవీ కావాల్రా మీకు , సిగ్గు లజ్జ పూర్తిగా వదిలేశారా.. అక్కడో ఇంకోదగ్గరో చదువుకుంటున్న, పనిచేసుకుంటున్న అక్కాచెల్లెళ్ళు , అమ్మలు గుర్తుకురాలేదారా సైకోలు.. చదువులెందుకురా మీకు.తల్లుల కడుపున చెడబుట్టిన విష పురుగులు మీరు… ఛీ…
Rajitha Kommu