ఎస్సీ అబ్బాయిని పెళ్లిచేసుకున్నందుకు…
నడిరోడ్డు మీద లేడి కానిస్టేబుల్‌ను నరికి చంపిన సోదరుడు…
ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన…
మూడు రోజుల కిందటే మా ఊరికి మీరు రావొద్దని బెదిరించిన వచ్చిన సోదరుడు, బంధువులు..
అయినా భయపడకుండా అత్తారింటి నుంచే విధులకు హాజరవుతున్న నాగమణి..
దారికాచి కత్తితో నరికి చంపి.. పోలీసుల ముందు లొంగిపోయిన సోదరుడు..
సిటీలో కలకలం రేపిన పరువు హత్య..
వాస్తవం ప్రతినిధి- రంగారెడ్డి జిల్లా:
ఆ అమ్మాయి ఎస్సీ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆమె ప్రాణాలు తీసే వరకు తెచ్చింది. కష్టపడి చదివి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి నచ్చినోడిని పెళ్లి చేసుకుంది. ఒక నెల క్రితమే వీరిద్దరూ యాదగిరి గుట్టలో పెద్దలనెదిరించి పెళ్లి చేసుకున్నారు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న నాగమణిని అతని సోదరుడు, బంధువులు వెళ్లి మన ఊరికి రావొద్దని, ఎక్కడికైనా వెళ్లి బతకండని, ఊళ్లోకి వస్తే పరువు పోతుందని బెదిరించి వచ్చారు. అయినా ఆమె వినలేదు.
ఇబ్రహీంపట్న మండలం రాయపోలు గ్రామంలోని అత్తారింటి నుంచే విధులకు హాజరువుతున్నది. ఇవాళ దారి కాచి ఆమె సోదరుడు కారుతో ఢీకొట్టి అనంతరం కత్తితో నడిరోడ్డుపై నరికి చంపాడు.. మృతురాలిది బీసీ కుర్మ కులం కాగా.. అబ్బాయి ఎస్సీ కులానికి చెందిన వాడు. ఈ పరువు హత్య సిటీలో కలకలం రేపింది.