ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మెంటల్లీ అన్‌ఫిట్ అని సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ చీఫ్ బాల లత అన్నారు. సివిల్ సర్వీసుల్లో దివ్యాంగులకు కోటా ఎందుకు అని ఆమె సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది. ఈ దుమారం ఇంకా కొనసాగుతున్నది. తాజాగా బాల లత దీనిపై స్పందించారు. ఆమె ఫిజికల్‌గా ఫిట్.. మెంటల్లీ అన్‌ఫిట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారామె.
ఈ ఆలోచన ఆమె వ్యక్తిగతమా.. ? లేక ప్రభుత్వ ఆలోచనా..? అని కూడా ఆమె కౌంటరివ్వడం మరింత రచ్చకు తెరతీసింది. దివ్యాంగులను దూరం పెట్టమని స్మిత చెబుతున్నారు.. రేవంత్ సర్కార్ తొలి ఉద్యోగం దివ్యాంగురాలికే ఇచ్చింది. దివ్యాంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరం. స్మితా సబర్వాల్ మీరు రాజీనామా చేసి రండి.. ఇద్దరం మళ్లీ పరీక్ష రాద్దాం.. మనిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దాం… అని సవాల్ విసిరారామె.
24 గంటల్లో తన వ్యాఖ్యలను స్మిత ఉపసంహరించుకోవాలని, లేదంటే జైపాల్ రెడ్డి స్మృతివనం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపడతామన్నారు. స్మితా పై సీఎం రేవంత్‌రెడ్డి , సీఎస్ శాంత కుమారిలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.