దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

బోధన్‌ మాజీ ఎమ్మెల్యేకు శని వెంటాడుతోంది. నిను వీడని నీడను నేనే అనే విధంగా వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాజకీయంగా అతనికి ఇబ్బందులు, కొత్త తలనొప్పులు, తలవంపులు తెచ్చిపెడుతున్నాయి. ఓటమి తరువాత వరుసగా అతనికి ఎదురవుతున్న సంఘటనలు చర్చకు తెర తీస్తున్నాయి. ఓటమి తరువాత శరత్‌రెడ్డి అతని రైస్‌మిల్లులపై దాడి చేయించి కోలుకోని దెబ్బ తీశాడు. ఈ ఎంక్వైరీ ఇంకా నడుస్తోంది. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధాన్యాన్ని బ్లాక్‌ చేసిన ఉదంతాన్ని అధికారులు గుర్తించి లెక్కలు తీస్తున్నారు. ఇది ఇలా కొనసాగుతుండగానే తాజాగా అతని కొడుకు సాహెల్‌ రూపంలో మరో పెద్ద ఉపద్రవం వచ్చి పడింది షకీల్‌కు.

షకీల్‌ కొడుకు సాహిల్‌ సోమవారం అర్థరాత్రి రాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ ప్రజాభవన్‌ వద్ద యాక్సిడెంట్‌ చేశాడు. ఆ సమయంలో ఆ కారులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసు నుంచి కొడుకును తప్పించేందుకు షకీల్‌ తీవ్ర ప్రయత్నాలు చేశాడు. డ్రైవింగ్ చేసింది కొడుకు కాదంటూ ఎవరినో పోలీసుల వద్ద ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. సీసీ టీవీ పుటేజీలు తెప్పించుకుని ఎంక్వైరీ చేసిన పోలీసులు షకీల్‌ కొడుకే ఇలా చేశాడని గుర్తించారు. రాష్‌ డ్రైవింగ్‌, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం, పోలీసులను మోసగించేందుకు ప్రయత్నం .. పలు సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశారు. కానీ ఆలోగా సాహెల్‌ను దుబాయ్‌కు పంపిచేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుల జిల్లాలోనే రాష్ట్ర స్థాయిలో చర్చకు తెర లేపింది.

గతంలో కూడా షకీల్‌ కొడుకు ఇదే విధంగా రాష్ డ్రైవింగ్‌ చేసి ఒకరి ప్రాణాలు తీశాడనే కేసు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లో నమోదయ్యింది. ఇప్పుడిలా కొత్త యాక్సిడెంట్‌తో మళ్లీ తెరపైకి వచ్చాడు సాహెల్‌. తండ్రిని రాజకీయంగా తెరమీదకు లాగాడు.

You missed

అర్వింద్‌ ‘పసుపు’ రాజకీయం.. మళ్లీ తెరపైకి బాండుపేపర్.. రెండేండ్లలో టన్నుకు 20వేలు ఇస్తానని ప్రకటన… మళ్లీ అవే ‘బాండ్‌’ అబద్దాలతో ఎంపీ రైతుల చెవిల్లో పసుపు… ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. ప్రస్తుతం పసుపు క్వింటాళ్‌కు 14వేల పై చిలుకు ధర పలుకుతున్న వైనం.. ఎందుకు ఇంత రేటు పెరిగిందో తెలియని నేతల అవగాహనారాహిత్యం.. 70వేల ఎకరాల నుంచి సాగు విస్తీర్ణం సగానికి పడిపోయిన వైనం.. పెరిగిన ఎగుమతి డిమాండ్.. చాలా మంది రైతులు పసుపు పండిచేందుకు వెనుకడుగు.. దీనికి ఎవరు కారణం.. ? పసుపుబోర్డు తెస్తానని ఐదేండ్లు కాలయాపన చేసి ఫలితంగా పసుపు ‘సాగు’ బంగారమయిన దుస్థితి.. రేవంత్‌ కూడా బీజేపీకి మైలేజీ ఇచ్చేలా అవగాహనారాహిత్యపు ట్వీట్‌… మళ్లీ బాండ్‌ పేపర్‌ రాస్తానని బరితెగించిన చెప్పిన అర్వింద్.. కానీ బీఆరెస్‌, కాంగ్రెస్‌ నేతల్లో చలనం లేని రాజకీయ నిస్తేజం.. ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌….