దండుగుల శ్రీనివాస్‌, వాస్తవం ప్రతినిధి:


(వాస్తవం ఎక్స్‌క్లూజివ్‌)

వారిద్దరూ ఓడారు. కానీ అధికారం మాత్రం వీరే చెలాయిస్తున్నారు. పోలీసులను బెదిరిస్తారు. మీటింగులు పెట్టి వార్నింగులు ఇస్తారు. మా మాటే చెల్లుబాటు కావాలని హుకుం జారీ చేస్తారు. అధికారులు మా ఫోన్లకే స్పందించాలంటారు. ఓడినా మేమే ఎమ్మెల్యేలమంటారు. మా మాట వినకపోతే ఖబడ్డార్‌ అంటారు. ప్రభుత్వం మాదే. వింటారా..? ఉంటారా…? పోతారా..? చెప్పినట్టు చేస్తారా…? అంతే ఇవే బెదిరింపు మాటలు. ఇవి ఎక్కడో కాదు. ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాల్లో ఓడిన ఎమ్మెల్యేల దాష్టీకాలకు చిన్న ఉదాహరణలు మాత్రమే. స్వయంగా ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి బహిరంగంగా ఓ సభలో తన వేదన చెప్పుకునే దారుణ పరిస్థితులు అక్కడ తయారయ్యాయి అంటే ఓడిన ఎమ్మెల్యే వినయ్‌ రెడ్డి ఏ రేంజ్‌లో సామాంతర రాజ్యం నడుపుతున్నాడో.. అధికారులను, పోలీసులను గుప్పిట్లో పెట్టుకునేందుకు అధికార బూచి చూపి ఎలా చెలరేగుతున్నాడో తెలుసుకోవడానికి తార్కాణాలు.

ఓడితే మాకేంది..? ప్రజలు ఛీ కొడితే మాకేటి సిగ్గు.. అనే విధంగా వీరు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం మాదే. పెత్తనమూ మాదే. అధికారము మాదే. మేం చెప్పిందే వేదం.. ఇదీ వీరిద్దరి వ్యవహార శైలి. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఓడిన అభ్యర్థి ముత్యాల సునీల్‌రెడ్డి ఇప్పటికే పోలీసులతో మీటింగు పెట్టుకున్నాడు. అంతా తాను చెప్పినట్టు నడవాలని హుకుం జారీ చేశాడు. వినకపోతే అంతే సంగతులు అనే విధంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశాడు. ఆర్మూర్‌లో వినయ్‌రెడ్డి అధికారులకు, పోలీసులకు హుకుం జారీ చేశారు. కాంట్రాక్టర్లకు కూడా ఫోన్లు చేసి తనకే కమీషన్లు ఇవ్వాలని లేకపోతే మీరెలా పనులు చేస్తారో చూస్తామంటూ బెదిరింపులకు దిగాడు. ఈ బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలు జిల్లాలో చర్చకు తెర తీస్తున్నాయి.

You missed

అర్వింద్‌ ‘పసుపు’ రాజకీయం.. మళ్లీ తెరపైకి బాండుపేపర్.. రెండేండ్లలో టన్నుకు 20వేలు ఇస్తానని ప్రకటన… మళ్లీ అవే ‘బాండ్‌’ అబద్దాలతో ఎంపీ రైతుల చెవిల్లో పసుపు… ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. ప్రస్తుతం పసుపు క్వింటాళ్‌కు 14వేల పై చిలుకు ధర పలుకుతున్న వైనం.. ఎందుకు ఇంత రేటు పెరిగిందో తెలియని నేతల అవగాహనారాహిత్యం.. 70వేల ఎకరాల నుంచి సాగు విస్తీర్ణం సగానికి పడిపోయిన వైనం.. పెరిగిన ఎగుమతి డిమాండ్.. చాలా మంది రైతులు పసుపు పండిచేందుకు వెనుకడుగు.. దీనికి ఎవరు కారణం.. ? పసుపుబోర్డు తెస్తానని ఐదేండ్లు కాలయాపన చేసి ఫలితంగా పసుపు ‘సాగు’ బంగారమయిన దుస్థితి.. రేవంత్‌ కూడా బీజేపీకి మైలేజీ ఇచ్చేలా అవగాహనారాహిత్యపు ట్వీట్‌… మళ్లీ బాండ్‌ పేపర్‌ రాస్తానని బరితెగించిన చెప్పిన అర్వింద్.. కానీ బీఆరెస్‌, కాంగ్రెస్‌ నేతల్లో చలనం లేని రాజకీయ నిస్తేజం.. ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌….