సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వరరావుకు రాజకీయాలు అచ్చి రావడం లేదు. ఆయన రిటైర్‌మెంట్‌ ప్రకటించుకున్న తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకోవడం కలిసి వస్త లేదు. నాడు కవితను ఎంపీగా గెలిపించేందుకు కేసీఆర్‌ మండవ ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించాడు. ఆ తరువాత పట్టించుకోలేదు. దీంతో ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నాడు. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి మళ్లీ మండవ ఇంటికి వెళ్లాడు.

పార్టీలో తర్వలో జాయినింగ్‌ ఉంది. క్లారిటీ వచ్చింది. రూరల్‌ టికెట్‌ ఇస్తామనే కమిట్‌మెంట్‌ ఇచ్చారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆ ఇద్దరి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నగేశ్‌ రెడ్డి లు ఇద్దరూ మండవ రాకను వ్యతిరేకిస్తూ ఇవాళ నియోజకవర్గంలో ఆందోళనలకు దిగారు. ఇస్తే గిస్తే మాలో ఎవరికో ఒకరికి ఇవ్వాలి.. ఈ ఆంధ్ర నాయకుడు మధ్యలో ఎక్కడ్నుంచి వచ్చాడంటూ మండవ సీనియారిటీని, అధిష్టానం నిర్ణయాన్ని చీ కొడుతున్నారు.

ఇప్పుడిది ఇందూరు కాంగ్రెస్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అరికెల నర్సారెడ్డి కాంప్రమైజ్‌ అయిపోయాడు. ఇతనితో బాధ లేదు. ఇప్పుడు వచ్చిన చిక్కంతా భూపతిరెడ్డి, నగేశ్‌రెడ్డితోనే. దీనికి తోడు ఆంద్ర, తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేస్తున్నారు ఈ ఇద్దరు అసంతృప్త నేతలు. దీంతో మండవ రాక పార్టీకి ప్లస్‌ ఏమోగానీ, వీరి చేష్టలతో మరింత దిగజారేలా ఉంది.

You missed