‘సాధారణంగా పార్టీలు నాయకులకు హ్యాండిస్తాయి. కానీ పార్టీలకే హ్యాండ్ ఇచ్చిన ఘనత ఆ నాయకుడి సొంతం. బాల్కొండ నియోజకవర్గం లో అన్ని పార్టీలకు హ్యాండ్ ఇచ్చిన ఏకైక నాయకుడిగా రికార్డు సైతం ఆయన సొంతం. ఈ ఘనతను సొంతం చేసుకోవడంలో నిర్మొహమాటంగా.. ఇంకొంచెం సూటిగా చెప్పాలంటే ఎవడు ఏమనుకుంటే నాకేం సిగ్గు అన్న చందంగా ‘గోపి’ పొలిటికల్ ఫార్ములా ను బ్రహ్మండంగా వాడేశాడు ఆయన.
అందుకే నాటి నుంచి నేటి వరకు, ఇప్పుడు ఆయన కొనసాగుతున్న పార్టీలో కూడా ఆ గోపి ఫార్ములానే అనుసరిస్తున్నాడు. ప్రజల విషయంలోనూ, ప్రజల ప్రధాన అంశాల్లోనూ ఆ గోపి విధానాన్ని ఫాలో అవుతున్నాడు. ఉదాహరణకు ఆయన ఇప్పుడున్న పార్టీ నాయకులంతా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రస్తుతం పసుపు బోర్డు అంశాన్ని ఎన్నికల ముందు రైతులను మోసం చేసే మరో స్టాండ్ గా విమర్శిస్తూ విరుచుకుపడుతుంటే ఆయన మాత్రం ఆ ఊసే ఎత్తడు. గతంలో ఉన్న పార్టీలో కూడా ఇప్పుడున్న పార్టీపై విమర్శ చేయలేదు. ఇప్పుడున్న పార్టీలో గతంలో ఉన్న పార్టీపై విమర్శలు చేయడం లేదు. ఏ పార్టీ ఆదరించక నాది ఆ..ఆ.. ‘రేంజ్’ .. ఐదో పదో విదిలిస్తే సరి ప్రజల ప్రధాన సమస్యలపై కామెంట్ చేసి టిక్కెట్లు ఇచ్చే ప్రధాన పార్టీల డోర్లను ఎందుకు మూసేసుకోవాలి అనే రాజకీయం చేసి చివరకు ఓ రాజకీయ పార్టీ ‘ చేతి’ ని నోట కరుచుకుని అదే వైఖరితో గోడ మీద కూర్చున్నాడు ఆ గోపి. ఇప్పుడు అతగాడు ఉన్న పార్టీలో అతగాడినీ , అతగాడి గ్రూపునీ ‘గోపి’ గ్రూప్ అని పిలుస్తున్నారు.
ఇలాంటి చర్చంతా ఆదివారం ఆ నాయకుడు ఓ దావత్ పార్టీ పెట్టి..వచ్చిన ఆ కొంత మందిని అంత మంచిదేనా అని కూడా అడగకుండా, వాళ్ళ ముందే అనుచరులను జనాలు యేరి, పైసలు వేస్ట్ చేస్తున్నారు అని చిందులు వేసి ..వచ్చిన ఆ కొద్ది మందినీ పిలిచి అందరూ వేస్ట్, నేనే బెస్ట్, చెక్ డ్యాం లు వేస్ట్, వేల ఎకరాలకు, వందల మంది రైతులకు లాభం జరిగినా సరే..ఒక్క రైతుకు నష్టం జరిగింది అనేదే నా బాధ అని ఉపన్యాసం దంచాడు. అక్కడ ఆయన గారు ఉన్నపార్టి నాయకుల్లో గోపి గ్రూప్ కానివారికి మండింది. ఈయన గారి బస్సుల్లో గంజాయి, తుపాకీ దొరికాయి కదా ..అప్పుడు ఈయనదే అదంతా అని ఏ ఒక్క పార్టీ నాయకుడు ఈయనను విమర్శించ లేదు కదా అనే చర్చ మొదలు కాగానే సరె సరే మల్ల మంచి దావత్ ఇస్తనే అని ముంగించేశాడు ఆ ఫెయిల్యూర్ ‘చిత్ర’ ప్రదర్శనను.