మహిళా బిల్లు పట్ల పోరాటం చేసి పార్లమెంటులో ఆమోదించే వరకు కడదాకా కొట్లాడిన కవితమ్మకు ఇందూరు స్వాగతం పలుకుతోంది. మహిళా బిల్లు ఆమోదంతో దేశం మొత్తం ఒక్కసారిగా కవితపై చూసింది. అప్పటి వరకు ఈ బిల్లు కోల్ట్‌ స్టోరేజీలో పెట్టేశాయి కేంద్ర ప్రభుత్వాలు. ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేపట్టిన కవిత అన్ని వర్గాల మద్దతు కూడగట్టి గట్టి వాయిస్ వినిపించిందామె. ఎట్టకేలకు కేంద్రం తాజాగా జరిగిన పార్లమెంట్‌ సెషన్‌లో ఈ బిల్లును ఆమోదించారు.

దీంతో కవితమ్మ ఇంట పండగ సందడి కనిపించింది. జనం జాతర దర్శనమిచ్చింది. శుభాకాంక్షలు వెల్లువలా ముంచెత్తాయి. ఇప్పుడామె ఇందూరుకు రానున్నారు. సోమవారం తొలిసారిగా ఆమె జిల్లాకు వస్తున్న నేపథ్యంలో నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా ఆధ్వర్యంలో ఈ ర్యాలీ, పాదయాత్ర ఆర్‌ఆర్‌ చౌరస్తా నుంచి పాత కలెక్టరేట్‌ వరకు వరకు కొనసాగనుంది. కవితకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.

You missed