రామడుగు మండలంగా ఏర్పడిన నేపథ్యంలో జిల్లాలో పెద్ద నియోజకవర్గంగా అతవరించింది నిజామాబాద్‌ రూరల్‌. ఈ మూల నుంచి ఆ మూల వరకు.. ఎంత తిరిగినా ఇంకా పల్లెలు మిగిలే ఉంటాయి. ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్న తురుణం.. వయోభారం ఇబ్బంది పెడుతున్నా… పెండింగ్‌ పనుల ప్రారంభం కోసం , పూర్తయిన పనుల ప్రారంభోత్సవాల కోసం, చేయాల్సిన పనులకు శంఖుస్తాపనలకు బాజిరెడ్డి పల్లెబాట పట్టాడు. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు.. వరుసగా నెల రోజుల పాటు బాజిరెడ్డి పల్లె పల్లె చుట్టి రావలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు.

శనివారం ఇందల్వాయి మండలంలోని డబుల్ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి దశకు వచ్చిన సందర్బంగా వాటిని ఆయన సందర్శించారు. ఆదివారం నుడా చైర్మన్‌ ఈగ సంజీవరెడ్డి, తన తనయుడు, తైక్వాండో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒలంపిక్‌ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్‌తో కలిసి ఆయన మోపాల్‌ మండలంలోని సిరిపూర్‌లో పర్యటించారు. పాత గడీని సుందరీకరణ చేసేందుకు నుడా నిధుల నుంచి రూ. 50 కోట్లను దీనికి కేటాయించారు. పలు శంఖుస్థాపనలు ప్రారంభోత్సవాలలో పాల్గొన్నారు. పల్లె ప్రజలతో మమేకమయ్యారు. వారి సమస్యలు ఓపిగ్గా విన్నారు. పరామర్శలు చేశారు. మోపాల్‌ మండలంలోని మంచిప్పలో కూడా బాజిరెడ్డి పర్యటించారు.

సోమవారం నాడు జక్రాన్‌పల్లిలో జరిగే మైనార్టీల మీటింగులో పాల్గొననున్నారు. ఆ తర్వాత ఆ మండంలోని పలు పల్లెలలను చుట్టిరానున్నారు. ధర్పల్లిలో వంద పడకల ఆస్పత్రి మంజూరైన నేపథ్యంలో దీని కోసం ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును బాజిరెడ్డి ఆహ్వానించారు. ఈనెలాఖరు వరకు ఆయన ఈ కార్యక్రమానికి రానున్నారు. నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గంలో శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం ఆయన సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పల్లెబాట పడుతున్నారు. పల్లె ప్రజలను కలుస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఉనికే కరువైన నేపథ్యంలో బాజిరెడ్డి మాత్రం తన పనితాను చక్కబెట్టుకుంటూ పల్లెల్లో కారును షికారు చేయిస్తున్నారు. ప్రగతిపథాన్ని ఓ వైపు ప్రచారం, మరోవైపు పల్లెజనంతో మమేకం అనే రీతిలో ఆయన పర్యటనలుంటున్నాయి.

గోవన్న ఫీల్డులోకి దిగాడంటేనే ప్రతిపక్షాలకు వణుకు మొదలైంది. నీకా నాకా.. నువ్వా నేనా రీతిలో ఇంకా టికెట్ల కన్ఫాం కాని పరిస్థితుల్లో వాళ్లంతా కొట్టుమిట్టాడుతుంటే బీఆరెస్‌ మాత్రం దూకుడు మీద దూసుకెళ్తున్నది.

You missed