సీనియర్‌ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మళ్లీ వార్తల్లో కేంద్ర బిందువయ్యాడు. చాలా రోజులుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్‌ స్వయంగా వెళ్లి ఆయన్ను బీఆరెస్‌లో చేర్చుకున్నా.. ఆ తర్వాత పార్టీ పట్టించుకోలేదు.. ఆయనా దూరంగానే ఉన్నాడు. మధ్యమధ్యలో బీజేపీలో చేరుతున్నాడని, కాంగ్రెస్‌లో చేరుతున్నాడనే ఊహాగాన వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి.

దీనిపై ఇవాళ ఆయన తన సన్నిహితుల వద్ద కొన్ని నర్మగర్బంగా కామెంట్లు చేశాడని విశ్వసనీయంగా తెలిసింది. ‘ ప్రస్తుత రాజకీయాలు నాకు పడవు. నేను సెట్ కాను. నా రాజకీయ జీవితం ముగిసింది. నేనిప్పుడు ఏ పార్టీలో లేను. రాను..’ అని చెబుతూనే… ‘ అరికెల నర్సారెడ్డి కాంగ్రెస్‌ నుంచి ట్రై చేస్తున్నాడుగా..’ అంటూ సూత్రప్రాయంగా, పరోక్షంగా అతనికి సపోర్టు చేయాల్సిందిగా కూడా సన్నిహితులు ఫోన్లు చేసినప్పుడు చెబుతున్నాడట. ఇదీ సంగతి..!

You missed