ఆర్మూర్‌ బీఆరెస్‌ నుంచి త్వరలో కీలక నేతలు చాలా మంది బీజేపీలోకి రానున్నారని, బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని కామెంట్‌ చేశాడు బీజేపీ నేత పైడి రాకేశ్‌రెడ్డి. దత్తపుర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ గంగదేవి మహేష్ దంపతులకు ఆర్మూర్ బీజేపీ నాయకుడు పైడి రాకేష్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.గతంలో బీజేపీ లో గెలిచి బిఅర్ఎస్ పార్టీలోకి వెళ్లి తిరిగి సొంతగుటికి చేరడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి కోసం బిఅర్ఎస్ లోకి రావాలని ఒత్తిడి చేసి బలవంతంగా అధికార పార్టీలో చేర్చుకున్నారు అని అయిన అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు అని అన్నారు.బీజేపీ కి రావడం సంతోషంగా ఉంది అని అభివృద్ధి బీజేపీ తో సాధ్యం అని రాకేష్ రెడ్డి అధ్వర్యంలో ఆర్మూర్ బీజేపీ గెలువడం తధ్యం అని అన్నారు.

రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అక్రమాలు కబ్జాలు పోవాలి అంటే బీజేపీ గెలుపు ఆర్మూర్ లో అత్యవసరం అని అతి త్వరలో బీజేపీ లోకి ముఖ్య నాయకులు వస్తున్నారు ఇప్పటికే పలువరు నాయకులు కూడా టచ్ లో ఉన్నారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో డోoకేశ్వర్ మండల అధ్యక్షుడు సురేందర్ ఎంపీటీసీ లు సంజీవ్,చిన్నారెడ్డి బీజేపీ అసెంబ్లి కన్వీనర్ పలేపు రాజు,కళ్లెం సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

You missed