కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు క్యూ కట్టారు. శుక్రవారానికి చివరి తేదీ కావడంతో ఇప్పటి వరకు ఆరుగురు దరఖాస్తులు చేసుకున్నారు. ధర్మపురి సంజయ్, డాక్టర్ శివ ప్రసాద్, మహేశ్ కుమార్ గౌడ్, కేశవేణు, నరాల కళ్యాణ్, తాహెర్‌బిన్ హందాన్‌లు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఏ నియోజకవర్గంలో కూడా ఇంత మంది దరఖాస్తు చేసుకోలేదు.
అర్బన్ నుంచి పోటీ ఎక్కువైంది. మరోవైపు అధిష్టానం ఇప్పటికే సర్వేల పేరుతో ఓ క్లారిటీకి వచ్చి ఉన్నది. కానీ ఇప్పుడప్పుడే క్యాండిడేట్ పేరు వెల్లడించేలా లేదు. గతంలో ఇక్కడి నుంచి తాహెర్, మహేశ్‌కుమార్ గౌడ్‌లు పోటీ చేసి ఓడిపోయారు. వీరికి మళ్లీ పార్టీ చాన్స్ ఇచ్చే అవకాశం లేదు. ఇక బీసీలకే ఇక్కడ సీటు ఇస్తామని ముందే ప్రకటించిన నేపథ్యంలో సంజయ్, కళ్యాణ్‌లు ఇద్దరు మున్నూరుకాపులు కాగా, డాక్టర్ శివ ప్రసాద్ పద్మశాలి, కేశవేణు కురమ. సర్వేలననుసరించి ఎవరికి టికెట్ కేటాయిస్తుందేననే ఉత్కంట కొనసాగుతోంది.