బాల్కొండ నియోజకవర్గంలో సోమవారం వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రైతు ధర్నా తుస్సుమంది. అటు ఇటుగా ఓ 200 మంది రైతులు మాత్రమే ధర్నాలో కనిపించారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నా తుస్సుమంది అనేకంటే అనవిగానివేళ ఓ నయా లీడర్ అత్యుత్సాహంతో ధర్నా కార్యక్రమం పెట్టి కాంగ్రెస్ పార్టీని తుస్సుమనిపించాడు అనే నిరుత్సాహం కార్యకర్తల్లో నెలకొంది. ధర్నాకి ఒకరోజు ముందు ఆదివారం రాష్ట్రమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ ధర్నాను ఉద్దేశించి రైతులకు విన్నవిస్తూ విడుదల వీడియో విడుదల చేశారు.

ఏ పార్టీ ఏ పార్టీపై ధర్నాకు పిలుపునిచ్చింది… ధర్నాకు పిలుపునిచ్చిన పార్టీకి గతంలో రైతులను వేధించి రైతులపై కాల్పులు జరిపిన దురాగతాన్ని రైతులు మర్చిపోతారా అంటూ మంత్రి కాంగ్రెస్ హయాంలో రైతుల ఎదుర్కొన్న అనుభవాలను గుర్తు చేశారు. టిఆర్ఎస్ రైతులకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఏడాదంతా కురవాల్సిన వాన మూడు గంటల్లోనే కురిస్తే ఎలాంటి నష్టం తప్పనిసరిగా జరుగుతుందో అనేది వివరించి వరద పేరిట బురద రాజకీయం చేస్తున్నారని రైతులకు వివరించి ధర్నాపై ఆలోచన చేయాలని కోరారు. ఈ వీడియో రైతుల్లో వైరల్ గా మారింది. హోటళ్ల వద్ద కూడళ్ల వద్ద చర్చకు దారితీసింది. దీంతో రైతులు కాంగ్రెస్ పిలుపునిచ్చిన ధర్నాను విజయవంతం చేస్తారా లేక మంత్రి ఇచ్చిన పిలుపుతో ధర్నాకు దూరంగా ఉంటారా అనే ఆసక్తి సర్వత్ర కనిపించింది. చివరకు రైతన్నలు ధర్నాను లైట్ తీసుకున్నారనేది సోమవారం ధర్నాలో కనిపించిన రైతుల సంఖ్యని స్పష్టం చేసింది. ఇది మంత్రి ఇచ్చిన వీడియో సందేశం పిలుపుతో రైతన్నలు ఆలోచించి తీసుకున్న నిర్ణయంగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

ధర్నా వైఫల్యం, కాంగ్రెస్ పార్టీపై దాని ప్రభావం తో కలిగే నష్టానికి బాధ్యులు ఎవరు అనే పరస్పర అంతర్గత ఆరోపణలు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్లో మొదలైనట్లు సమాచారం. ఏకాభిప్రాయం లేకుండా ఒంటెద్దు పోకడలతో ఎడాపెడా పరిగెడితే ఇలాగే ఉంటుందని సందేశాన్ని ఈ ధర్నా ఇచ్చిందని అభిప్రాయం అప్పుడే బలపడిపోయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ధర్నా ప్లాప్ పై జరుగుతున్న ఒపీనియన్లు కాంగ్రెస్ కార్యకర్తలను అసహనానికి గురిచేస్తున్నాయి. బలుపు ఏదో వాపు ఏదో గుర్తించకుండా ఆగమాగం చేస్తున్నారని ఇలా అయితే కష్టమే అని నిట్టూర్పు వినిపిస్తున్నాయి.