బీజేపీ సీనియర్‌ నేత వినయ్‌రెడ్డి బీజేపీకి గుడ్‌బై చెప్పాడు. కాంగ్రెస్‌ ఆర్మూర్‌ బరి నుంచి దాదాపుగా టికెట్‌ ఖరారైనట్టు విశ్వసనీయంగా తెలసింది. ఈనెల 18న కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నాడు. బీజేపీ అధిష్టానికి ఓ పెద్ద లేఖ రాశాడు. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ మాయలో పడి పార్టీని మొత్తం సర్వనాశనం చేశారని ఆవేదన వెలిబుచ్చాడు. అందుకే తాను పార్టీని వీడుతున్నానని చెప్పుకొచ్చాడు. బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అర్వింద్‌ వైఖరి వల్ల ఎంతో మనోవేదనకు గురవుతున్నారని, ఇది అధిష్టానం పట్టించుకోవడం లేదని ఇది ఆ పార్టీ ఖర్మ అని వైరాగ్యంలో వ్యాఖ్యానించాడు. మొత్తానికి కాంగ్రెస్‌ అధినాయకత్వంతో చర్చలు సఫలమైనట్టు తెలిసింది. ఆర్మూర్‌ బరి నుంచి టికట్‌ దాదాపుగా కన్ఫాం అయినట్టు తెలిసింది. ఇది బీజేపీకి పెద్ద దెబ్బే.

You missed