నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజక వర్గానికి స్థానిక ఎమ్మెల్యే టి ఎస్ ఆర్ టి సి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శుభవార్తను అందించారు. నియోజక వర్గం లోని డిచ్ పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చాలాకాలంగా విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు కోరుతూ వస్తున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ ఈ డిమాండ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సోమవారం డిచ్ పల్లి లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయించారు.

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మంజూరి ఇచ్చి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాజిరెడ్డి గోవర్ధన్ రూరల్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.

You missed