రాష్ట్ర ఐటీ పురపాలక పరిశ్రమల శాఖామంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బుధవారం నిజామాబాద్ నగరానికి రానున్నారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ హబ్ ను మంత్రి కేటీఆర్.. రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే, టిఎస్ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి ఐటి హబ్ ను, దాని సమీపంలోనే నిర్మించిన న్యాక్ భవనాన్ని కేటీఆర్ ప్రారంభిస్తారు. ఖిల్లా రఘునాథ ఆలయం వద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్, పలు వైకుంఠ ధామాలు, తదితర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఉపాధి కల్పనలో కీలకంగా మారిన ఐటీ కాపు ప్రారంభోత్సవ నేపథ్యంలో యువత ఆసక్తిగా, ఉత్సాహంగా పాల్గొననున్నారు.

రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఐటీ హబ్ లను ద్వితీయ శ్రేణి నగరాలకు సైతం విస్తరించే కృషిని మంత్రి కేటీఆర్ చేపట్టారు. ఈ క్రమంలో నిజామాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా ఐటీ టవర్ హబ్ నిర్మాణం చేయించారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఐటి హబ్ నిర్మించారు. ఇటీవల ఐటీ హబ్ లో ఉద్యోగాల కోసం భారీ జాబ్ మేళా నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా దృష్టి నిలిపి జాబ్ మేళాను విజయవంతం చేశారు. 750 మందికి ఐటీ హబ్ లో ఉపాధి అవకాశాలు కల్పి కలిగేలా చేశారు. ఈ ఐ టి హబ్ లో ఎప్పటికప్పుడు ఉపాధి అవకాశాలను అందిస్తూనే ఉండాలని ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహించేలా ఎమ్మెల్సీ కవిత ప్రణాళిక చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 29న మరో జాబ్ మేళా భూమా రెడ్డి కన్వెన్షన్ లో నిర్వహించనున్నారు.

మంత్రి కేటీఆర్ రాక నేపథ్యంలో నగరం గులాబీమయంగా మారింది. ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు.

You missed