కవితమ్మ కదన బేరి.. ఇందూరుకు ఆమే ఆశాదీపం.. అభివృద్ధికిపై ఇక ప్రత్యేక ఫోకస్‌… అర్బన్‌లో తనదైన ముద్ర, యువతకు ఉపాధి విషయంలో చేయూత హస్తం… మాస్టర్‌ప్లాన్‌ అమలు, రింగురోడ్డు నిర్మాణం, స్మార్ట్‌ సిటీగా ఇందూరును తీర్చిదిద్దడంపై ప్రత్యేక నజర్‌… ఆమె రాజకీయ జీవితం ఇందూరుతో పెనవేసుకున్న వైనం… జిల్లాపై తనదైన ముద్ర… నియోజకవర్గాలపై పోస్టుమార్టం.. మళ్లీ క్లీన్‌స్వీప్‌ దిశగా అడుగులు.. ప్రజలను వీడని లీడర్‌.. ఇంతవరకు ఎవరూ తేని నిధులు ఇందూరుకు.. ఇకపై తనదైన మార్కు డెవలప్‌మెంట్‌ కోసం కసరత్తులు… చరిత్రలో గుర్తిండిపోయేలా కవిత మార్కు ఇందూరు రాజకీయం.. రాజకీయాలకు అతీతంగా, విమర్శకుల నోళ్లు మూతపడేలా కార్యాచరణ… (‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌ కథనం..)

కవితమ్మ కదన బేరి

– టిఆర్ఎస్ వైభవం కొనసాగేలా స్పెషల్ ఫోకస్

-జిల్లాలో అన్ని సెగ్మెంట్లలో విక్టరీ స్కెచ్ లో నిమగ్నం

-విపక్షాలతో వార్ ప్లాన్

శాసనమండలి సభ్యురాలు, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎన్నికల కథన బేరి ఆల్రెడీ మోగించారా… జిల్లాలో ఐదింటి కి 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ విజయాన్ని మరోసారి ఆవిష్కృతం చేసే పనిలో నిమగ్నమయ్యారా.. ఆషామాషీగా కాకుండా విజయమే లక్ష్యంగా విక్టరీ స్కెచ్ సిద్ధం చేశారా అంటే… అవుననే చెప్పాలి. కొద్ది రోజులుగా కల్వకుంట్ల కవిత జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ పోస్టుమార్టం ప్రారంభించి లోటుపాట్లను సవరించి పార్టీకి మరోసారి తిరుగులేని విజయాన్ని అందించే విజయ యజ్ఞాన్ని మొదలుపెట్టారు. జిల్లాలోని ఒక్కో నియోజకవర్గము పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఇదివరకే బోధన్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై లోతైన సుదీర్ఘ సమీక్ష జరిపారు. లోటుపాట్లను గుర్తించి నష్ట నివారణ కు అవకాశమే లేకుండా చర్యలు చేపట్టారు. జిల్లాలో అన్ని నియోజక వర్గాలకు సంబంధించిన ఇలాంటి సమీక్షలు నిర్వహిస్తూ టిఆర్ఎస్ అభ్యర్థులను ఎన్నికల లోపే విన్నింగ్ ట్రాక్పై నిలబెట్టే కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టనున్నారు. పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎన్నికల కథన బేరి ఆల్రెడీ మోగించారు. గత లోక్సభ ఎన్నికల్లో విపక్ష అభ్యర్థి అబద్ధాలే అస్త్రంగా రైతులను ప్రజలను మోసం చేసి గెలుపు మెట్లవైపు అనైతిక అడుగులు వేస్తున్న కూడా నైతికతకే కట్టుబడి టిఆర్ఎస్ ఓటమిని ఎదుర్కొన్నది. ఈ ఓటమిని అనతి కాలంలోనే అన్నదాతలు ప్రజలు టిఆర్ఎస్ నైతిక గెలుపుగా గుర్తించారు.

అబద్దాల హామీలతో గెలిచిన విపక్షాన్ని, గెలుపు అన్న మాటకే విలువ లేకుండా చేసిన చెవిలో పువ్వు బ్రాండ్ లీడర్ ను అబద్ధాల బాండ్ పేపర్ తో గెలిచిన లీడర్ వి అంటూ అన్నదాతలు అడుగడుగునా ఆగ్రహంతో ఉరిమి ఉరిమి తరిమి తరిమిన సంఘటనలు సినిమాల్లో అనైతిక అబద్దాల అసత్యాల రాజకీయ నాయకులను ప్రజాక్షేత్రంలో తరిమికొట్టిన సన్నివేశాలను తలపించాయి. ఈ ప్రజాగ్రహ ఘట్టాలు టిఆర్ఎస్ ఓటమిని మంచి పై అబద్ధాలతో చెడు గెలిచిందని చాటి చెప్పాయి. దీంతో టిఆర్ఎస్కు లోక్సభ ఎన్నికలు జరిగిన అనతి కాలంలోనే నైతిక విజయాన్ని ప్రకటించారు అన్నదాతలు.

అన్నదాతలు ప్రకటించిన ఈ చారిత్రక నైతిక విజయ ఫలితాలను విపక్షాలు మరోసారి అనైతికంగా, అడ్డదారిలో, దొడ్డి దారిలో, తెర వెనుక చేతులు కలిపి వృధా చేయకుండా ఉండడం కోసం నిరంతరం ప్రతిక్షణం అప్రమత్తంగా టిఆర్ఎస్ శ్రేణులు ఉండేలా ప్రత్యేక అప్రమత్త వ్యూహాలను సిద్ధం చేశారు. వాటిని 100% అమలు జరిగేలా కూడా కార్యాచరణ రూపొందించారు. కల్వకుంట్ల కవిత

 

కవిత ఇప్పుడు ఇందూరు రాజకీయాల్లో తనకంటూ ఓ చెరగని ముద్ర వేసుకున్న లీడర్‌. ఎంపీగా ఆమె ఓటమి చెందినా ఏనాడూ ప్రజలను వదిలేది లేరు. తనెక్కడున్నా ఎవరికి అవసరమొచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చారు. ఆపద ఎలాంటిదైనా.. అత్యవసరం ఎప్పుడొచ్చినా అందరికీ గుర్తొచ్చేది ఆమె. అన్నపూర్ణగా అన్నదానం చేసి అందరి కడుపు నింపినా… పేద విద్యార్థులకు అండగా ఉండి ఉన్నత చదువులకు ఆసరాగా నిలిచి భరోసా నింపినా ఆమే.

ఎందరో నాయకులను చూస్తూ వచ్చాం. కానీ ఇందూరుకు కవిత జనానికి దొరికిన ఓ వరం. సీఎం కూతురుగానే కాదు.. ఆమె సేవాతత్పరత, ప్రజలతో మమేకమయ్యే తీరు, మాటతీరు మనింటి ఆడపడచే అనిపించేలా ఉంటుంది. మన బాధలు అర్థం చేసుకుని వాటిని తీర్చే దయాగుణం కలిగి ఉంటుంది. ఢిల్లీ వెళ్లినా.. గల్లీలో తిరిగినా ఆమె ధ్యాసంతా నిజామాబాదే. ఇందూరు జిల్లాలో పార్టీ బలోపేతం, నాయకుల పనితీరు, ప్రజల కష్టసుఖాలు ఆమె నిరంతరం పరిశీలించే ప్రధాన అంశాలు. ఆమెకు ఎప్పటికప్పుడు ఈ విషయాలను తెలుసుకునే నెట్‌వర్కూ అదే స్థాయిలో ఉంటుంది.

జిల్లాపై ఆమెది అప్పటి నుంచీ ప్రత్యేక ముద్రే. ఎక్కడైనా ఓ ఎమ్మెల్యేపై వ్యతిరేకత వచ్చినట్లు తెలిస్తే చాలు ఆమె అక్కడి జనంతో, నాయకులతో మేమకమవుతారు. పోస్టుమార్టం చేస్తారు. ఎమ్మెల్యే పనితీరునూ కడిగేస్తారు. పట్టింపులేని తనాన్నీ ప్రశ్నిస్తారు. నడవడిక మార్చకోమంటారు ఏమాత్రం మొహమాటం లేకుండా. అందుకే ఆమె అంటే ఎమ్మెల్యేలకు భయంతో కూడిన గౌరవం. పార్టీని కాపాడుకోవడమే ఆమె ప్రధాన లక్ష్యం. పార్టీ అనే చెట్టుకిందే మనమంతా పచ్చగా బతుకుతున్నామని, మనతో పాటు ప్రజలకు మంచి పాలన అందిస్తున్నామని నమ్మే కవిత.. నిజామాబాద్‌ జిల్లా పార్టీపై ప్రత్యేక అభిమానం, గౌరవం ఎప్పుడూ ప్రదర్శస్తూ ఉంటారు. ఈ మధ్య ఎవరెవరో ఏమేమో ప్రచారాలు చేశారు. అక్కడ నుంచి పోటీ చేస్తారు..? ఇక్కడి నుంచి పోటీ చేస్తారు..? అంటూ. కానీ ఆమెకు ఒకటే లక్ష్యం. అన్ని సీట్లు టీఆరెస్‌ గెలుచుకోవాలి. ప్రతిపక్షాలు ధీటుగా సమాధానమివ్వాలి.

అందులో తన పాత్ర గణనీయంగా ఉండాలి. అదే తన కర్తవ్యంగా ఆమె స్వీకరిస్తారు. అందు కోసం ఎంతటి శ్రమకైనా ఓరుస్తారు. మొన్నటి బోధన్‌ నియోజకవర్గ మీటింగులో దాదాపు ఆరుగంటల విరామం లేకుండా ఆమె రివ్యూ నిర్వహించడం ఆమెకున్న ఓపిక, కమిట్‌మెంట్‌కు నిదర్శమనే చెప్పాలి. వాస్తవంగా ఎవరికీ తెలియని విషమేమిటంటే… రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో రాని నిధులను జిల్లాకు ఆమె తెప్పించారు. ప్రధానంగా నగరాభివృద్ధిపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టారు. నిధులు రాబట్టడంలో కూడా ఆమెది గణనీయమైన పాత్రే. కానీ ఆమె అనుకున్న స్థాయిలో అభివృద్ధి ఇంకా జరగలేదనే అంసతృప్తైతే ఉంది. అందుకే ఆమె ఇప్పుడు దీనిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. మాస్టర్‌ప్లాన్‌ అమలు, జిల్లాకు కొత్త కంపెనీలను తీసుకురావడం, యువతకు ఉపాధి, ఔటర్‌ రింగు రోడ్డు కోసం విశేషంగా కృషి చేయడం.. అది పూర్తయ్యే వరకు విశ్రమించకుండా వెంటపడటం, ప్రభుత్వంతో సమాలోచలను చేయడం ఆమె నగరాభివృద్ధిపై చూపుతున్న నిబద్దతకు నిలువుటద్దం.

మెగా జాబ్‌మేళా పేరుతో ఐటీ హబ్‌లో దాదాపు 750 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు ఆమె. ఇంకా మరిన్ని జాబ్‌మేళాలను నిర్వహించి మెట్రో నగరాల్లో ఇంట్రస్ట్‌ ఉన్నవారికి అక్కడ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆమె భావిస్తున్నారు. ఆ దిశగా ఆమె ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. గతంలో ఏ నాయకుడు చేయని అభివృద్ది, అందుకోసం ఆమె పెట్టే ఎఫర్ట్స్‌, కమిట్‌మెంట్‌ చూసి ఉండము. ఇప్పుడ చూడబోతున్నాం. ఇది ప్రతిపక్షాలకు అశనిపాతంలాగే తోస్తుంది. కానీ జనాలకు మరుపురాని పాలనను చరిత్రలో గుర్తుండిపోయేలా చేస్తుంది. ఆమె రాజకీయ జీవితం ఇందూరుతో విడదీయరాని అనుబంధాన్నే పెనవేసుకున్నది. ఆ అనుబంధం పేగుబంధంగా మారింది. ఆమె ఇందూరును ఓ రోల్‌మోడల్‌గా రాష్ట్రంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దే విషయంలో కంకణబద్దులై ఉన్న విషయాన్ని ప్రజలు గుర్తించారు. ఇంకా నమ్మనివారు, విమర్శించే వాళ్లకూ ఆమె మున్ముందు చేపట్టబోయే డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు, ప్రత్యేక నిధుల కేటాయింపు.. స్మార్ట్‌సిటీగా తీర్చిదేద్దే క్రమమే సమాధానం కాబోతుంది.

 

ఇదే క్రమంలో జిల్లా కేంద్రం కీలకంగా ఉండాల్సిందేనని.. ఇక్కడ పార్టీ బలంగా ఉండడం ఎప్పుడైనా తప్పనిసరి అవసరమని భావించి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో లోటుపాట్లు అనేవే ఉండకూడదని కృతనిశ్చయంతో కవిత ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి పరంగా చిన్న కార్యక్రమం మొదలు భారీ కార్యక్రమాల వరకు అన్నీ కూడా సత్ఫలితాలను ఇచ్చే దిశగా విజయవంతం కావాల్సిందేనని కృతనిశ్చయంతో ఉన్నారు. ఇదే కృతనిశ్చయంతో ఈ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిని కొనసాగించనున్నారు. నిజామాబాద్ నగర అభివృద్ధిని ఓ రేంజ్ లో సుస్థిరం చేయాలని సంకల్పంతో ఇదివరకే ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో వేల కోట్లు నిధులు తెచ్చారు. ఇకపై నిజామాబాద్ నగరానికి చరిత్రలో నిలిచిపోయే లాంటి అభివృద్ధిని అందించే కీలక యోచనలు చేస్తున్నారు.

You missed