గత పార్లమెంటు ఎన్నికల్లో చేతి గుర్తు పార్టీకి హ్యాండిచ్చి జిల్లాలో బిజెపి కమల వికాసానికి దోహదం చేసి అరవింద్ గెలుపునకు బహిరంగ రహస్యంగానే పనిచేసిన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ మళ్లీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వేదికలపై చాలాకాలం తర్వాత ప్రత్యక్షమవడం పై కాంగ్రెస్ శ్రేణుల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో నిలిచిన మధుయాష్కి తానేలాగూ గెలువలేనని.. తీరా బరిలో నిలిచాక కాంగ్రెస్ పార్టీకి చెయ్యి ఇచ్చి బిజెపి గెలుపుకు దోహదపడి కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ను మరిన్ని కష్టాల్లోకి నెట్టేసి చెక్కేశాడని తద్వారా కాంగ్రెస్ పార్టీని నీరుగార్చాడని ఆ పార్టీ నేతలే ఎన్నోసార్లు దుమ్మెత్తి పోశారు.

జిల్లా కాంగ్రెస్లో నైరాస్యాన్ని నింపిన మధు యాష్కీ కి కాంగ్రెస్ అధిష్టానం ఏకంగా ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఇది వరకే పెదవి విరుపుతో ఉన్నాయి. కార్యకర్తలు ఇలాంటి పెదవి విరుపులు ఉండగా ప్రచార కమిటీ చైర్మన్గా మధు యాష్కి మాత్రం జిల్లాకు ముఖం చాటేసినట్టుగానే ఉండిపోయాడు. చాన్నాళ్ళ తర్వాత గురువారం ముత్యాల సునీల్ రెడ్డి స్వాగత సభలో మధుయాష్కి పునర్దర్శనం కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. నాడు కాంగ్రెస్ పార్టీ గాలి తీసిన మధు యాష్కి గౌడ్ మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఊపిరి ఉదుతాడు అంటే ఎలా నమ్మేది అనే డౌట్లు నెలకొన్నాయి.

You missed