పాపం.. ముత్యాల సునీల్‌రెడ్డి. ఎలాగోలా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న కదా.. బాల్కొండ టికెట్ వస్తుందని ఇంకా భ్రమల్లో ఉండగా.. ఇటు జిల్లా అధ్యక్షుడు, బాల్కొండ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న మానాల మోహన్‌రెడ్డి మాత్రం తన ప్రచారం తను చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. పార్టీలో చేరిన తర్వా భారీ ర్యాలీతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని సునీల్ కలలు కంటుంటే.. మెహన్‌రెడ్డి మాత్రం క్షేత్రస్థాయిలో తిరుగుతూ తనే పోటీ చేస్తున్నా అనే లెవల్లో ప్రచారం చేసుకుంటున్నాడు.
బుధవారం నుంచి నియోజకవర్గంలో వాల్ రైటింగ్స్ చాలు చేశాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాలుగు వేల పింఛన్, పదిహేను వేల రైతుబంధు ఇస్తామంటూ సంక్షేమ పథకాల హామీలతో కూడిన వాల్ రైటింగ్స్‌లో తన ఫోటోను పెట్టుకుని మరీ ప్రచారం చేసుకుంటున్నాడు. సునీల్ ఇంకా నియోజకవర్గం రాకముందే తను మాత్రం అంతా చుట్టి వస్తున్నాడు. ఇప్పుడు బాల్కొండ కాంగ్రెస్‌లో ఇది చర్చకు తెర తీసింది. నియోజకవర్గానికి రావడానికి మీనమేశాలు, ముహూర్తాలు చూసుకుంటా సునీల్ హైదరాబాద్‌లో కాలయాపన చేస్తుంటే మోహన్‌రెడ్డి నేనున్నానంటూ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రజల వద్దకు వెళ్తున్నాడు.
ఈ పరిణామం సునీల్ వర్గీయులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. సునీల్ వచ్చే వరకు జరగాల్సిన నష్టం జరుగుందనే భయం వారికి పట్టుకున్నది.