డీఎస్‌ తనయుడు ధర్మపురి సంజయ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాటి నుంచి ఒంటరే అయ్యాడు. ఎవరినీ కలుపుకుపోవడం లేదు. సీనియర్లు దగ్గరకి రానీయడం లేదు. కనీసం ఇప్పటి వరకు పార్టీ జిల్లా కార్యాలయం మెట్లు కూడా ఎక్కలేదు. కానీ బుధవారం ప్రెస్‌మీట్‌ పెట్టాడు. తనదే అర్బన్‌ అన్నాడు. బస్తీ మే సవాల్‌ విసిరాడు. తామంతా ఐకమత్యంతో ఉన్నామని చెప్పుకొచ్చాడు. కానీ తిరగడం మాత్రం సింగిలే.పార్టీలో చేరికలూ సింగిలే.

ఈ పరిణామంతో మండిపోయిన సీనియర్లు ఇదేం పద్దతి.. సీనియర్లు లేకుండా ప్రొటోకాల్ లేకుండా ఎలా పార్టీలో చేరికలు ఉంటాయి..? ఇంకోసారి ఇలా చేస్తే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తామనే హచ్చరిక కూడా చేశారు. కానీ సంజయ్‌ వినలేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. బుధవారం ప్రెస్‌మీట్‌ పెట్టి తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేశాడు. తనకే అర్బన్‌ టికెట్‌ అని పరోక్షంగా చెప్పుకుని, అటు అధికార పక్షానికి, ఇటు స్వపక్షానికి కూడా బస్తీమే సవాల్‌ విసిరాడు.

అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా మీద ఆరోపణలు సంధించాడు. ఇక్కడ జరిగినంత అవినీతి మరెక్కడా జరగలేదన్నాడు. అభివృద్ధి పై చర్చకు సిద్దమా అని కూడా సవాల్‌ విసిరాడు. ఎంపీ అర్వింద్‌పై కూడా విరుచుకు పడ్డాడు. అర్వింద్‌ ఈసారి తుక్కుతుక్కుగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పాడు.ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దిక్కులేరని, కాంగ్రెస్‌ జిల్లాలో క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని అన్నాడు.

You missed