విపత్తుల్లో ప్రజల తో వెన్నంటి ఉండేవారే విలువైన నాయకులు. తమను నమ్ముకున్న, ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలకు ఆపద సమయంలో అండగా నిలిచిన వారే సిసలైన ప్రజా నాయకులు. ఉత్త సమయంలో ఊదరగొడుతూ.. మీడియా లోగోల ముందు అధర గొడుతూ విపత్తుల వేల పత్తా లేకుండా పోయేవారు ప్రజల మనసులు నిలిచిపోజాలరు. ఇలాంటి పరిస్థితిని ప్రస్తుత వరద విపత్తు వేల ప్రజలు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లను పోల్చి చూస్తూ విపత్తు వేళలో విలువైన నాయకుడు ఎవరు అనేది గమనిస్తున్నారు.
కొవిడ్ విపత్తు కాలంలో గాని, పలుమార్లు అతి భారీ వర్షాలతో ఎదురైన విపత్తుల వేల గాని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తమ వెంట తమకు అండగా నిలిచి సేవలు అందిస్తున్న వైనాన్ని ప్రస్తుత వరదల వేల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కోవిడ్ విపత్తు కాలంలో మంత్రి వేముల భయపడకుండా ప్రజల మధ్య ఉంటూ వెలగట్టలేని సేవలు అందించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు నిత్యావసర సరుకులు, భోజనాన్ని తన సొంత ఖర్చుతో అందించారు. క్వరంటైన్ కేంద్రాల్లో సౌకర్యాలు సమకూర్చారు. అవసరమైన ఔషధాలు, అంబులెన్స్ వాహనాలు అందుబాటులో ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆక్సిజన్ అందకుండా మృతి చెందిన వారిని చూసి కలత చెంది తన మిత్రులు, తన సతీమణి అందించిన రూ. 1.60 కోట్లతో బాల్కొండ నియోజకవర్గం లోని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయించారు.
మోర్తాడు దవాఖానాలో ఆక్సిజన్ ఉత్పత్తి బాటిలింగ్ యూనిట్ను రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా తన నియోజకవర్గ ప్రజల కోసం ఏర్పాటు చేయించారు గడిచిన 8 ఏళ్లలో భారీ వర్షాలతో విపత్తు లాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ప్రజలతోనే ఉన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి అధికారులతో అందేలా చేయిస్తూ తాను సైతం సొంత ఖర్చులతో సహాయాలు చేశారు. వరదల్లో చిక్కుకున్న వారిని అత్యవసర సహాయ బలగాలను తెప్పించి మరి కాపాడారు. ఇలా విపత్తు వేళల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు అండగా నిలిచారు. విపత్తులో విలువైన నాయకుడిగా ప్రశంసలు కృతజ్ఞతలు పొందారు.
ఇలా ప్రజలతో మమేకమయ్యే ప్రశాంత్ రెడ్డి పై నిత్యం విమర్శలు చేస్తూ ఉండే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విపత్తుల వేల ప్రజల మధ్య కనిపించకుండా పోవడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి. కోవిడ్ విపత్తు సమయంలో అరవింద్ అంతంత మాత్రంగానే ఆగుపించాడు. వరదల సమయాల్లోనూ మొఖం కనిపించని సందర్భాలే ఎక్కువ. మీడియా లోగోల ముందు మైకుల ముందు విమర్శలు ఆరోపణలు దండిగా కురిపించే అరవింద్ కష్ట కాలంలో కానరాడేమి అనే విమర్శ ప్రజల్లో ఉంది. ప్రస్తుతం జిల్లాలో రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురిసి జనం ఇబ్బందులు పడుతున్న వేల తక్షణమే ప్రజల మధ్యకు చేరుకున్న ప్రశాంత్ రెడ్డి ని చూస్తూ.. కనిపించని అరవింద్ గురించి పత్తా లేడని అంటున్నారు.