తన పై ఆరోపణలు చేస్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. అరవింద్ ఆరోపణలపై ఆమె సూటిగా, ఘాటుగా ప్రశ్నలు కురిపించారు. ఆరోపణలు నిరూపించుకుంటావా ? లేక ముక్కు నేలకు రాస్తావా ? తేల్చుకో అంటూ అర్వింద్ కు విస్పష్టంగా డెడ్ లైన్ సంధించారు. రాజకీయాల్లో లేని తన భర్త పై విమర్శలు చేయడమేమిటని మండిపడ్డారు. చౌకబారు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఊరికే తమాషాలు, మజాకులు చేస్తే సహించే ప్రసక్తే లేదని అరవింద్ పై నిప్పులు చెరిగారు.

తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని.. లేదంటే ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే బాగుండదని హెచ్చరించారు. ’24 గంటల టైం ఇస్తున్నా.. ఈ లోగా ఆరోపణలను రుజువు చెయ్.. లేదంటే పులాంగ్‌ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పు’ అని అల్టిమేటం ఇచ్చారు. రాజకీయాల్లో లేని తన భర్త పేరు ఎందుకు తీస్తున్నావని నిలదీశారు. అరవింద్ ఎక్కడి నుంచి పోటీ చేసిన ఆయన పై తమ పార్టీ అభ్యర్థిని గెలిపించి తీరుతానని మరో సారి తేల్చి చెప్పారు.

తన తండ్రి కేసీఆర్‌ని అన్నారని.. ఇప్పుడు తన భర్తను కూడా విమర్శిస్తుంటే ఊరుకునేదే లేదన్నారు. మజాక్ చేస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. జాతీయ రహదారిపై గుంతలు ఉంటే గడ్డి పీకుతున్నాడా అని ఘాటుగా విమర్శించారు. అరవింద్ కేంద్రం నుంచి ఏన్ని నిధులు తెచ్చాడని నిలదీశారు.

You missed