పేద ప్రజల అభ్యున్నతి కోసమే మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంది

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

దన్ పాల్ సూర్యనారాయణ

ఈరోజు నిజాంబాద్ నగరంలోని 15 డివిజన్లో మహాజన సంపర్క్ అభియాన్ లో భాగంగా డివిజన్ నాయకులు కోరువ రమేష్ ఆధ్వర్యంలో గడపగడపకు బిజెపి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా దన్ పాల్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు తొమ్మిది సంవత్సరాల పరిపాలన ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధిని వివరించడానికి గడపగడపకు బిజెపి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు పేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్న ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అవలంబిస్తే లేదన్నారు ఉచిత బ్యాంకు అకౌంట్ బేటి బచావో బేటి పడావో ఉజ్వల యోజనధర గ్యాస్ సిలిండర్ లేని వారికి సిలిండర్ మూడు సంవత్సరాల నుంచి రేషన్ బియ్యం ఉచితంగా పేదలకు అందిస్తుంది అన్నారు.

ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్ ఒక వరం అన్నారు రైతుల కోసం కిసాన్ సన్మానిధి ద్వారా 6000 రూపాయలు వస్తున్నాయని కెసిఆర్ రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు నిజాంబాద్ వాసులకు డబుల్ బెడ్ రూమ్ ఒక కలగానే మిగిలిపోతుందని అన్నారు ఇప్పటివరకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా అందజేయాలని పరిస్థితుల్లో ఇక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారని అన్నారు రాష్ట్రంలో కెసిఆర్ నీరంకుష వైఖరి అవలంబిస్తున్నారన్నారు పేద ప్రజలంతా భారతీయ జనతా పార్టీతోనే ఉన్నారన్నారు అని అన్నారు కెసిఆర్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు గణేష్ గుప్తాకు దత్తత గ్రామం నుంచే ఎదురుగాలి తగులుతాదన్నారు దత్తత తీసుకున్న డివిజన్లో సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఇప్పటికైనా డివిజన్లో పర్యటించి పేదల కోసం పనిచేయాలని ఇతవు పలికారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు రంజిత్ ,సత్యనారాయణ, మేదరి శేఖర్, నాగొల్ల లక్ష్మీనారాయణ, నారాయణ యాదవ్ ,వినోద్ రెడ్డి బంటు రాము బూర్గుల వినోద్, భట్టికారి ఆనంద్ ,కుమార్ ,మఠం పవన్ ,హరీష్ రెడ్డి, శివుని భాస్కర్, డివిజన్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు

You missed