” అమ్మను మించి దైవం ఉన్నదా.. నింగికి నిచ్చెన వేసే మొనగాడినే… అయినా నీ ముందు పసివాడినే”

ఇరవయ్యో శతాబ్దం సినిమాలో కథానాయకుడు, కథనాయకుడి తల్లి కొడుకుల మధ్య ప్రేమానుబంధాల నేపథ్యంలో సాగే పాట ఇది. కానీ అంతకు మించిన బాధ్యత, ప్రజానుబంధాల కర్తవ్యాన్ని నెరవేర్చడంలో రాజకీయ నాయకులు, మంత్రులను సినిమాల్లోనూ చూస్తుంటాం. తల్లి అనారోగ్యం తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నా… క్షణం అవకాశం దొరికినా తల్లి చెంతకు చేరాలనే ఆరాటం ఉన్నా… తనకున్న ప్రజా బాధ్యత, తనకు తండ్రి సమానుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం తనకు నిర్దేశించిన కర్తవ్యాలను నెరవేరుస్తూ తల్లిపై ప్రేమను, మాతృమూర్తి ఆరాటాన్ని, కన్నీళ్లను బయటకు రానీయకుండా మూడు నెలలుగా, మరీ ముఖ్యంగా నెల రోజులుగా ఉద్యమ నేత కేసీఆర్‌ చెప్పిన పనులతోనే లీనమైన నేత మన కండ్లముందే ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. ఆయనే రాష్ట్ర మంత్రి, సీఎం కేసీఆర్‌ ప్రియ శిష్యుడు వేముల ప్రశాంత్‌ రెడ్డి.

దివంగత రైతు నేత, తన తండ్రి వేముల సురేందర్‌రెడ్డి తనకు రాజకీయ ఆరంగేట్రం చేసిన రోజు చెప్పిన మాటలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రజాసభల్లో అనేక సార్లు షేర్‌ చేసుకుంటూ వస్తుంటారు. అదేమిటంటే.. ” నీవు రాజకీయాల్లోకి అడుగు పెట్టాకా నీ అధినేత మాట నీకు శిరోధార్యం కావాలి.. అధినేత అగ్గిలో దూకమన్నా దూకాలి. నీ పార్టీ కార్యకర్తలను నీ కుటుంబ సభ్యుల్లా చూడాలి. మూడోది నువ్వు చట్టసభకు ఎన్నికైతే నిన్ను గెలిపించిన ప్రజలందరినీ పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా చూడాలి.. వారికి పార్టీలకు అతీతంగా సేవ చేయాలి” ఈ మూడు మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్న మంత్రి వేముల ఈ మధ్య కాలంలో తన తల్లి ఆరోగ్యం తీవ్ర ఆందోళనకరంగా ఉన్నా పాటిస్తుండటం కన్నీటిని తెప్పించేదిగా ఉంది.

ఈ మధ్యకాలంలో తన తల్లి ఆరోగ్యం విషమంగా ఉన్నా తన ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం తన అధినేత కేసీఆర్‌ నిర్దేశించిన కర్తవ్యాలను నెరవేర్చడంలో సంపూర్ణంగా మంత్రి కష్టపడుతున్న వైనం కన్నీళ్లతో చెప్పాల్సిందే. ఎందుకంటే .. ఆయన కేసీఆర్‌ తలపెట్టిన నూతన సెక్రటేరియట్‌ నిర్మాణం, దాని ప్రారంభోత్వవం, గురువారం జరిగిన అమరవీరుల స్మారక చిహ్న నిర్మాణం, దాని ప్రారంభోత్సవంతో పాటు ఈ మధ్యజరిగిన సీఎం కేసీఆర్‌ మానస పుత్రికల లాంటి ఎన్నో చారిత్రక నిర్మాణాలు, ఎన్నో ప్రజా కార్యక్రమాలు, ఎన్నో బాధ్యతల్లో పగలనక, రాత్రనక బాధ్యతలు నెరవేరుస్తూ వస్తున్నారు.

ఇదే సమయంలో ఇటు తాను ప్రాణంగా చూసుకునే బాల్కొండ నియోజకవర్గ బాధ్యతలు, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా బాధ్యతలు ఎక్కడా తగ్గకుండా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇదంతా ఆయన ఎంతో శ్రమకోరుస్తూ.. ఇరవై నాలుగ్గంటల్లోనే అటు హైదరాబాద్‌లో, ఇటు తన జిల్లాలో,తన నియోజకవర్గంలో పడుతున్న కష్టాలను ప్రజలంతా గమనిస్తున్నారు. కానీ ఆయన ఇవన్నీ ఒకపక్క తన మాతృమూర్తి విషమ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా… చేసుకుంటూ వస్తున్నారని, క్షణక్షణం అమ్మ గుర్తుకొస్తూ బోరున విలపించాల్సిన పరిస్థితుల్లో కూడా కన్నీటి కనుకొనలు దాటి బయటకు రాకుండా నెరవేరుస్తూ వస్తున్నారని చాలామందికి తెలియదు. ఇలాంటి పరిస్తితి వైరల్‌ అయితే అయ్యో అన్నవాళ్ల అమ్మ ఆరోగ్యం విషమంగా ఉందట అనే బాధతో తన నియోజకవర్గ ప్రజలు ఎక్కడ వారి ఇబ్బందులు తనకు చెప్పకుండా పోతారో అని ఇటీవల కొందరి సన్నిహిత కార్యకర్తలతో చెప్పడంతో కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు.

మంత్రిగారి మాతృమూర్తి ఆరోగ్యం ఆందోళనకర పరిస్థితుల్లో ఉండటంతో మంత్రి వేముల సహా ఆయన తమ్ముడు అజయ్‌రెడ్డి, తన సోదరి రాధికా రెడ్డి నిత్య వేదనలో ఉన్నారు. తన మాతృమూర్తి హైదరాబాద్‌లో మంత్రి సోదరి రాధిక రెడ్డి ఇంట్లో ఉన్నారు. క్షణం అవకాశం దొరికినా మంత్రి వేముల, తమ్ముడు అజయ్‌రెడ్డి అక్కడికి చేరుకుని అన్నదమ్ములు,సోదరి కన్నీటి ధారలు కారుస్తున్నారు. ఈ పరిస్తితుల్లో, ఇంతటి నిబద్దతతో కర్తవ్య నిర్వహణ చేస్తున్నారు కాబట్టే సీఎం కేసీఆర్‌ మంత్రి వేములను తన తమ్ముడు ప్రశాంత్‌రెడ్డి అంటారు అని ఈ బాధాకర ఎపిసోడ్‌ తెలిసినవాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.

You missed