అర్బన్‌లో అర్వింద్‌ అసమ్మతి పోటీ…

పోటీకి సై సై అంటున్న యెండల లక్ష్మీనారాయణ వర్గం..

పటేల్‌ ప్రసాద్‌ను బరిలోకి దింపాలనే యోచన..?

తలనొప్పిగా మారనున్న అర్బన్‌ టికెట్‌ వ్యవహారం…

మిగిలిన చోట్లా ఇదే పరిస్థితి.. పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన అర్వింద్‌ ఒంటెత్తు వ్యూహాలు..

బీజేపీ అనుబంధ సంఘాలు కూడా అర్వింద్‌కు యాంటీ..?

అర్వింద్‌ పోకడలకు చెక్‌పెట్టి… పార్టీని కాపాడుకునేందుకు రెబల్‌ వ్యూహం… అనుబంధ సంఘాల సపోర్టు..?

 

బీజేపీ బలం పుంజుకోవడమేమోగానీ… అర్వింద్‌ ఎంట్రీ తరువాత గ్రూపులుగా విడిపోయాయి. అన్ని నియోజకవర్గాల్లో తన అనుచరులకు, తన అనుయాయూలకు మాత్రమే టికెట్లు ఇప్పించుకునే క్రమంలో అర్వింద్‌ వేస్తున్న ఎత్తుగడ, వ్యూహాలు ఆ పార్టీలోనే అసమ్మతిని పెంచి పోషిస్తున్నాయి. నిజామాబాద్‌ ఎంపీగా గెలిచిన తరువాత తనకు తిరుగులేదని భావించిన అర్వింద్‌… పార్టీని తన చెప్పు చేతల్లోకి తీసుకున్నాడు. కానీ అదే సమయంలో పారట్ఈ కోసం సిన్సియర్‌గా పనిచేసే కార్యకర్తలను, సీనియర్‌ నాయకులను తొక్కేశాడు. యెండల లక్ష్మీనారాయణతో పాటు అతని వర్గాన్ని మొత్తం బీజేపీకి దూరం చేయాలని చూశాడు. కానీ వారు ఎదురు తిరుగుతూ స్వపక్షంలో ఉంటూ తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. అర్వింద్‌ నిన్నమొన్న వచ్చాడు.. మేము పార్టీని, పార్టీ సిద్దాంతాన్ని నమ్ముకుని ఏళ్లుగా బతికిన వాళ్లం మేం ఎందుకు పార్టీకి దూరం కావాలి అనే ఆలోచనతో చాలా మంది అర్వింద్‌ను దెబ్బ కొట్టేందుకు సమయం కోసం వేచి చూస్తున్నారు. అర్బన్‌ టికెట్‌ వ్యవహారం ఈ మధ్య రచ్చకెక్కింది.

యెండల వర్గాన్ని దూరం చేసిన అర్వింద్‌ … ఇక్కడ తన అనుకున్న నాయకుడికే టికెట్‌ వస్తుందని ప్రచారం చేసుకుంటున్నాడు. కానీ యెండలకు కాకుండా ఇతరులకు ఇస్తే… అసమ్మతి నేతగా యెండల లక్ష్మీనారాయణ రైట్‌ హ్యాండ్ … ముఖ్య అనుచరుడు పటేల్‌ ప్రసాద్‌ను బరిలోకి దింపాలని చూస్తున్నారు. పటేల్ ప్రసాద్‌ను ఈ మధ్యే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయించాడు అర్వింద్‌. యెండల వర్గానికి ఇదో హెచ్చరికలా దీన్ని ప్రయోగించాడు. కానీ పటేల్‌ ప్రసాద్ ఎక్కడా తగ్గలేదు. యెండల, వినయ్‌రెడ్డి తదితర అర్వింద్‌ అసమ్మతి నేతలతో కలిసి అక్రమ కేసులంటూ భారీ ర్యాలీ తీసి హంగామా చేశారు. దేవాలయ పరిపరక్షణ కమిటీ ఏర్పాటు చేసుకుని దానికి పటేల్ ప్రసాద్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. లవ్‌ జీహాదీకి వ్యతిరేకంగా, హిందూ ధర్మం, హిందూ సంప్రదాయలకు,పార్టీ సిద్దాంతాలకు అనుకూలంగా ఈ వేదికగా పనిచేస్తూ పోతున్నాడు.

ఈ మధ్య అర్వింద్‌కు బీజేపీ అనుబంద సంఘాలైన ఆర్ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీలు కూడా వ్యతిరేకమయ్యాయి. తమను పట్టించుకోవడం లేదని ఒంటెత్తు పోకడలు పోతున్నాడనే ఉద్దేశ్యంతో చాలా వరకు కార్యక్రమాలకు అర్వింద్‌ను పిలవడం మానేశాయి. అవసరమైతే బీఆరెస్‌ సపోర్ట్ తీసుకుంటున్నాయి కానీ అర్వింద్‌ను కలవడానికి కూడా ఇష్టపడటం లేదు. ఈ క్రమంలో యెండల వర్గానికి చెందిన పటేల్‌ ప్రసాద్‌ తను అర్బన్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలపాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన పటేల్‌ ప్రసాద్ .. అర్వింద్‌పై కసితో ఉన్నాడు. తన లీడర్‌, గురువు అయిన యెండలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనే కుట్రకు తోడు… పార్టీని పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తీసుకుని, సిద్దాంతాలకు తిలోదకాలిస్తున్నాడనే ఆగ్రహంతో ఉన్నారు. సీనియర్లను ఏమాత్రం పట్టించుకోవడం లేదేనే అసంతృప్తి, అసమ్మతి కూడా చాలా కాలంగా ఆపార్టీలో ఉంది. ఈ క్రమంలో అర్బన్ టికెట్ యెండలకు కాకుండా… ఎవరికిచ్చినా పటేల్ ప్రసాద్‌ ఇండిపెండెంట్‌ క్యాండిడేట్‌గా రెబల్‌గా నిలబడాలనే యోచనల చేస్తున్నారు. ఇలాంటి పరిస్తితి ప్రతీ నియోజకవర్గంలో ఎదురుకానుంది. అర్వింద్ అందరికీ ఆశ చూపి.. కొందరినే చేరదీసి.. చివరకు తనకు కావాల్సిన వారికే టికెట్ వచ్చేలా చేసి మిగిలిన వారిని యూజ్‌ అండ్‌ త్రో లా చేసే ఎత్తుగడ వేయడం… దాన్ని ముందే పసిగట్టిన వ్యతిరేకవ వర్గం అర్వింద్‌కు చెక్‌ పెట్టేందుకు రెబల్‌గా దిగేందుకు సమాయత్తం కావడం ఇప్పుడు ఇందూరు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

You missed