నాన్న..
బాబాయ్‌…

చైర్‌పర్సన్‌..

కామారెడ్డి బల్దియాలో చైర్ పర్సన్ పై అధికార పార్టీ కౌన్సిలర్ల కినుక

పేరుకే చైర్‌ పర్సన్.. వెనుకుండి నడిపించేదంతా నాన్న, బాబాయ్‌..

ఎవరైతే మాకేం..? మాకావాల్సిందే ఇస్తే చాలు.. వీరిద్దరి వైఖరితో విసుగెత్తిపోయిన బీరెఎస్‌ కౌన్సిలర్లు…

గాడితప్పిన కామారెడ్డి బల్దియా పాలన..

త్వరలో కాంగ్రెస్‌ గూటికి పది మంది బీఆరెస్‌ కౌన్సిలర్లు… షబ్బీర్‌తో ఇప్పటికే సంప్రదింపులు..

వాస్తవం- కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి బల్దియా పాలన గాడి తప్పింది. చైర్ పర్సన్ జాహ్నవిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు సొంత పార్టీ కౌన్సిలర్లు. పేరుకే ఆమె చైర్ పర్సన్‌. ఈమె వెనుకుండి అంతా నడిపించేది ఆమె తండ్రి, బాబాయ్‌. తమకు కావాల్సిన కమీషన్‌ ఇచ్చిన వాళ్లకే కాంట్రాక్టులు. అధికార పార్టీయా, మారో పార్టీయా డోంట్‌ కేర్‌. తమకు కావాల్సింది చేస్తారు. నచ్చినట్టు నడిపిస్తారు. ఎవరు చెప్పినా వినరు. చివరకు ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ జోక్యం చేసుకున్నా వీరి తీరులో మార్పు రాలేదు.

కామారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులున్నాయి. ఇందులో ఇప్పటికైతే 38 మంది బీఆరెస్‌కు ౩8 మంది ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి 8 మంది చేరారు గతంలో. ఇప్పుడు కాంగ్రెస్‌కు 4, బీజేపీకి 7 సంఖ్యాబలం ఉంది. చైర్‌ పర్సన్ తీరు… ఆమె తండ్రి, బాబాయి ఇష్టారాజ్యంతో గత కొంతకాలంగా ఇక్కడ కోల్డ్‌వార్‌ నడుస్తోంది. ఈ విషయం అందరికీ తెలుసు. ఇక పరిస్థితి మితిమీరి చేయిదాటి పోతున్నదని ఎమ్మెల్యే కూడా పలుమార్లు జోక్యం చేసుకున్నా.. నాన్న, బాబాయ్‌ వైఖరిలో మార్పు లేదు. యథావిధిగా, షరామామూలుగా వారు చెప్పినట్టే చైర్ పర్సన్ నడుచుకుంటున్నది.

ఏ ఫైల్‌ మీద సంతకం పెట్టాలి..? దేన్ని పెండింగ్‌లో పెట్టాలి..? ఎవరికి వేధించాలి..? ఎవరికి అందలమేయాలి..? అంతా తెరవెనుక ఉండి నడిపిస్తారన్నమాట. ఇదీ అక్కడ జరుగుతున్న తంతు. ఇక లాభం లేదని విసిగి వేసారి పోయిన ఓ పది మంది కౌన్సిలర్లు పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఇప్పటికే షబ్బీర్‌ అలీతో టచ్‌లో ఉన్నారు. సంప్రదింపులు అయిపోయాయి. నేడో రేపో కాంగ్రెస్‌ గూటికి ఈ అసంతృప్త కౌన్సిలర్లు జంప్‌ కావడం ఖాయం.