ఇందూరు విలేకరులకు జూన్‌ మొదటివారంలో ఇళ్ల స్థలాలు… తనను కలిసిన విలేకరులతో స్పష్టం చేసిన ఎమ్మెల్సీ కవిత…
ఆర్టీసీ చైర్మన్‌, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డితో సమన్వయం చేసుకొని ఫైనల్ చేసుకోవాలని సూచన..

 

వాస్తవం- నిజామాబాద్‌:

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల కల నెరవేరనుంది. ఎమ్మెల్సీ కవిత చాలా రోజుల తర్వాత జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా కొంత మంది విలేకరులు ఆమెను వెళ్లి కలిసి ఇంటి స్థలాల గురించి అడిగారు. ఇప్పటికే ఆమె నిజామాబాద్‌ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గ పరిధిలోని గుండారం ఏరియాలో దీనికి సంబంధించిన ప్లేస్‌ కూడా చూసి పెట్టారు. దీనిపై క్లారిటీ రాగానే ఇంటి స్థలాలు ఇచ్చేందుకు అంతా రెడీ అయ్యారు. ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ దీనిపై కసరత్తు చేస్తున్నారు. అధికారులతో ఇప్పటికే సర్వే చేయించారు.

ఎప్పటికప్పుడు కవితతో సమన్వయం చేసుకుంటూ జర్నలిస్టులకు ఇంటి స్థలాలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే జర్నలిస్టుల లిస్టు కూడా ఫైనల్ అయిపోయింది. వచ్చేనెల జూన్ మొదటి వారంలో మంత్రి కేటీఆర్‌ జిల్లాకు రానున్నారు. ఐటీ హబ్‌ ప్రారంభోత్సవంతో పాటు మున్సిపల్‌ కార్యాలయ నూతన బిల్డంగ్‌ ఇనాగ్రేషన్‌లో పాల్గొంటారు. ఆ సమయం నాటికి ఈ ప్లాట్ల విషయంలో పూర్తి క్లారిటీ తీసుకోవాలని, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌తో ఎప్పటికప్పుడు చర్చించి ఫైనల్‌గా తన వద్దకు రావాలని ఆమె విలేకరులకు సూచించారు.

You missed