సీబీఐ దిగొచ్చింది. దిగొచ్చేలా చేశాడు కేసీఆర్. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయముందంటూ వివరణ ఇవ్వాలంటూ సీబీఐ ఇచ్చిన నోటీసులకు తొలత కవిత స్పందించారు. సీబీఐ చెప్పిన ఆరో తారీఖున హైదరాబాద్‌లోని తన నివాసంలోనే భేటీ అవుతానని కూడా చెప్పారు. కానీ ఇక్కడే కథ మలుపు తిరిగింది. కేసీఆర్ దీన్ని సీరియస్‌గా తీసుకుని న్యాయ నిపుణులతో చర్చించారు. ఎప్‌ఐఆర్ కాపీ పంపాలని సీబీఐకి కోరగా.. అందులో కవిత పేరే లేదనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కవిత మొదట చెప్పిన ఆరో తారీఖు కాకుండా తనకు అనువైన తేదీలను ఇచ్చి మీ ఇష్టం ఏదో ఒక డేట్ ఎంచుకోండని చెప్పడంతో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎట్టకేలకు సీబీఐ దిగొచ్చింది. ఈ నెల 11న హైదరాబాద్‌లోని కవిత నివాసంలో భేటీ అవుతామని తెలిపారు.
వివరణ కోసం ఎమ్మెల్సీ కవిత అడిగిన ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో , 11 వ తేదికి సీబీఐ అంగీకారం
ఈ-మెయిల్ ద్వారా కవితకు సమాచారం ఇచ్చిన సిబిఐ
హైదరాబాద్: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సంబంధించిన కేసులో వివరణ కోసం టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఈ నెల 11న సమావేశం కావడానికి సిబిఐ అంగీకరించింది.
వివరణ కోసం ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో తన నివాసంలో అందుబాటులో ఉంటానని, అందులో అనువైన రోజున తనతో సమావేశం కావచ్చని సిబిఐ కి కవిత లేఖ రాసిన విషయం విధితమే.
కవిత లేక కు సిబిఐ స్పందిస్తూ ఈమెయిల్ ద్వారా సమాధానం ఇచ్చింది. 11వ తేదీన హైదరాబాద్లోని కవిత నివాసంలో 11 గంటలకు భేటీ అవుతామని సీబీఐ తెలిపింది.