ఢిల్లీ లిక్కర్ కేసును ఎమ్మెల్సీ కవిత మెడకు చుట్టి బద్నాం చేద్దామనుకున్న బీజేపీకి, సీబీఐకి కవిత షాక్ ఇచ్చింది. ఈనెల ఆరున .. రేపు దీనిపై వివరణ కావాలని సీబీఐ లేఖ రాయడం.. దీనికి కవిత కూడా తన నివాసంలో రెడీగా ఉంటానని బదులివ్వడం జరిగిపోయాయి. కానీ కేసీఆర్ దీన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. పలువురు న్యాయ నిపుణులతో చర్చించారు. తీరా లోతుల్లోకి వెళ్తే అసలు కవిత పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేనే లేదు. ఇక్కడ దొరికారు దొంగలు.. అనుకున్న సీఎం తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. కవిత ద్వారా ఓ లేఖ తిరిగి సీబీఐకి ఈ రోజు పంపారు. ఏమంటే… రేపు నేను బిజీ. మీరు రాకండి.. వీలు కాదు.. నాకు వీలైన డేట్లు ఇవీ.. అంటూ తనే వారికి తనకనువైన సమయాన్ని తేల్చి చెప్పడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీబీఐ వివరణ పేరుతో హడావుడి చేసి కవితను మరింత బద్నాం చేయాలని యోచించింది. దీని వెనుక బీజేపీ ఉన్నదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ బట్టకాల్చి మీదేసే ప్రక్రియ విజయవంతంగా అమలవుతున్నదుకుంటుకన్న నేపథ్యంలో.. కేసీఆర్ ఎంట్రీతో సీన్ మారింది. మీరు మాకు డేట్ ఇవ్వడమేంటి.. ఎఫ్ఐఆర్‌లో పేరే లేదు.ఛల్… మాకు వీలైనప్పుడు రాండ్రి అంటూ ఉల్టా లేఖ రాయడం .. ఈ బీజేపీ రాజకీయ కుట్రల కోణంలో టీఆరెస్ ఇచ్చిన కొత్త మలుపు. ఇదీ ఇప్పడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఇదీ కవిత రాసిన లేఖ సారాంశం….
ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు
సిబిఐ తన వెబ్ సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ ని క్షుణ్ణంగా పరిశీలించాను మరియు అందులో పేర్కొని ఉన్న నిందితుల జాబితాను కూడా చూశాను.
దానిలో నా పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలియజేస్తున్నాను
ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల 6న సమావేశం కాలేను
ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్ లోని నా నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటాను
సీబీఐకి కల్వకుంట్ల కవిత లేఖ
హైదరాబాద్: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరు ఎక్కడా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. “సిబిఐ తన వెబ్ సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ ని క్షుణ్ణంగా పరిశీలించాను మరియు అందులో పేర్కొని ఉన్న నిందితుల జాబితాను కూడా చూశాను. దానిలో నా పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలియజేస్తున్నాను.” అని పేర్కొన్నారు.
ఈ కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందిస్తూ సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ సీబీఐకి లేఖ రాసిన విషయం విధితమే. దానికి స్పందించిన సీబీఐ అధికారులు ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్ సైట్ లో ఉన్నదని తెలిపారు.
దాంతో తాను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని, కానీ అందులో తన పేరు ఎక్కడా లేదని కల్వకుంట్ల కవిత సోమవారం ఉదయం సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు లేఖ రాశారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీనా తాను సీబీఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని పేర్కొన్నారు.
తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని కవిత పునరుద్ఘాటించారు. దర్యాప్తునకు సహకరించడానికి గానూ పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశం అవుతానని లేఖలో తెలిపారు.