హెడ్డింగు పెట్ట‌డంతో ఒక్కోడిది ఒక్కో స్టైల్‌. ఒక్క కార్టూన్ ఎన్నో వార్త‌ల పెట్టు అంటారు. ఆ కార్టూన్ చూస్తే ఎన్నో భావాలు వ్య‌క్త‌మ‌వుతాయి. విమ‌ర్శ‌ల‌ను క‌లిపి .. చుర‌క‌లు జోడించి గీసే ఆ కార్టూన్లంటే అంద‌రికీ ఇష్ట‌మే. ఇప్ప‌టికీ. ఎప్ప‌టికీ. కానీ ఇప్పుడు విచ్చ‌ల‌విడిగా పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చిన యూట్యూబ‌ర్లు త‌మ ప‌నిత‌నాన్ని ఎలా చూపుతున్నారంటే… దాంట్లో మ‌సాలా ఉండాలా..! రెచ్చ‌గొట్టే హెడ్డింగులుండాలా..? ఆస‌క్తి కొల్పే డైలాగులండాలా..? అది వైర‌ల్ కావాల‌. అంతే .. దాని కోసం ఏమైనా చేస్తారు.

తొంద‌ర‌ప‌డి ఓ కోయిల ముందే కూసింది అన్న‌ట్టు … సీరియ‌స్ స్టేజ్‌లో ఉండి వెంటిలేట‌ర్‌పై ఎవ‌రైనా ప్ర‌ముఖులుంటే చాలు వాళ్ల‌ను చంపేస్తారు ఆ క్ష‌ణానే. ఇక సోష‌ల్ మీడియాలో రిప్‌ల మీద రిప్‌లు. ఇదీ మ‌న దౌర్బాగ్యం. ఇప్పుడు కృష్ణ చ‌నిపోయిన త‌ర్వాత ఓమీడియా వాడు పెట్టిన పోస్టు ఇది. పోయినోళ్లంతా మంచోళ్లు.. ఉన్నోళ్లు మ‌న తీపి గుర్తులు.. అని అర్థం వ‌స్తుంద‌నుకున్నాడేమో కాబోలు.. ఇక మ‌న‌కు మిగిలింది వీళ్లే. వీళ్లెప్పుడు పోతారో ఏమో… అన్న‌ట్టుంది.. వాడి హెడ్డింగు ఏడ్చిన‌ట్టే ఉంది.

You missed