నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తండ్రి డీఎస్ బాగా డ‌బ్బు సంపాదించి ఇచ్చాడు కానీ, సంప్ర‌దాయం, మ‌ర్యాద నేర్ప‌లేద‌ని, అందుకే పెద్దా చిన్న తేడా లేకుండా మంచీ మ‌ర్యాద లేకుండా మాట్లాడుతున్నాడ‌ని నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే , ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ విమ‌ర్శించారు. ఎంపీ క‌విత‌… అర్వింద్‌ను నిజామాబాద్ టౌన్‌లో న‌డిరోడ్డుపై చెప్పుతో కొడ‌తా.. అని మాట్లాడిన మాట‌ల‌పై ఆయ‌న స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాజ‌కీయాలంటే అర్వింద్‌కు తెలియ‌ద‌ని, ఆక‌స్మాత్తుగా యాక్సిడెంట‌ల్‌గా ఎంపీ అయ్యాడ‌ని, అయ్య డీఎస్ మంచి బుద్దులు నేర్పి పంప‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇక‌పై తీరు మార‌క‌పోతే త‌న్నులు త‌ప్ప‌వ‌న్నారు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ‌లా కార్య‌క‌ర్త‌లు దాడులు చేయ‌డ‌మే స‌బ‌బ‌ని ఆయ‌న అన్నారు. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే….ఆయ‌న మాట‌ల్లోనే…

వాడి భాషా బాగ‌లేదు. దేశంలో ఎంద‌రో ఎంపీలున్నారు. ఎవ‌రూ ఇలా లేరు. వీడి భాష బాగుండ‌దు. అందుకే టీఆరెస్ కార్య‌క‌ర్త‌లు దాడులు చేస్తున్నారు. అవ‌మాన ప‌రిచేలా మాట్లాడుతున్నాడు. మాట‌ల‌తో హింసిస్తున్నాడు. కార్య‌ర్త‌లు ఊకోరు క‌దా.. కోప‌మొచ్చిన‌ట్టుంది. అటాక్ చేసిండ్రు. అర్వింద్ నోరు అదుపులో పెట్టుకుంటేనే బాగుంట‌ది. ఇదే భాష ఇంకా మాట్లాడ‌తా అంటే మ‌ళ్లా త‌న్నులు గ్యారెంటీగా ప‌డ‌తాయి. నిజామాబాద్ జిల్లాలో మూడు నాలుగు సార్లు కార్య‌క‌ర్త‌లు దాడులు చేశారు. బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డాడు వాడు. బీజేపీ వాళ్లు ఇంకా అంద‌ల‌మెక్కిస్తే త‌న్నులు మాత్రం గ్యారెంటీగా ప‌డ‌తాయి. దేశంలో ఎక్క‌డా ఈ విధంగా మాట్లాడ‌టం లేదు. ప్ర‌తిప‌క్షాలు హుందాగా విమ‌ర్శ‌లు చేయాలి. సౌమ్యంగా మాట్లాడాలి. ప్ర‌తి విమ‌ర్శ చేయాలె. కానీ వీడ‌ట్ల కాదు.. వెధ‌వ వీడు. డైరెక్టుగా ఎంపీగా గెలిచిండు. వీడికి సంప్రాదాయం తెలియ‌దు. వాడ‌య్య నేర్ప‌లేడు. డ‌బ్బు సంపాదించి ఇచ్చిండు త‌ప్ప‌.. సంప్ర‌దాయం, మ‌ర్యాద నేర్ప‌లే వాళ్ల‌య్య వాడికి. అందుకే వంక‌ర వంక‌ర పోతున్న‌డు. వంక‌ర పోయే వెధ‌వ‌ను స‌క్క‌గ చెయ్య‌లే క‌దా. క‌రెక్టుగా ఉంటే దాడులు జ‌ర‌గ‌యి. నిజంగా సౌమ్యుడి మీద దాడి జ‌రిగితే ప్ర‌జ‌లు ఊరుకుంట‌ర‌.. తిరుగుబాటు చేస్త‌రు మా మీద‌. ప్ర‌జ‌లు కూడా అనుకుంటున్నారు.. వీడి భాష‌కు ఇదే స‌మాధాన‌మ‌ని. కుక్క‌కాటుకు చెప్పుదెబ్బ‌.. వాడికి చెప్పుదెబ్బ‌లే క‌రెక్టు వాడికి. ఇప్ప‌టి దాకా ఓపిక ప‌ట్టినం. ఇక స‌హించం.

You missed