ప్రభుత్వం నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ వేసింది. పోటీ పరీక్షల్లో సన్నద్దమయ్యేందుకు కావాల్సిన పుస్తకాలు, కోచింగ్, మెటీరియల్ అందించేందుకు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు కోచింగ్ సెంటర్ల ద్వారా వారికి తోచిన సాయం చేశారు. ఇతోధికంగా సాయపడ్డారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ సైతం బాజిరెడ్డి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు. బాజిరెడ్డి జగన్ దగ్గరుండి ఈ కోచింగ్ సెంటర్ నిర్వహణను చేపట్టారు. ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వచ్చారు. ఉద్యోగార్థులతో మమేకమవుతూ వచ్చారు. వారికి కావాల్సిన సదుపాయాల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ కావాల్సిన ఏర్పాట్లు కల్పించడంతో, మెటీరియల్ సమకూర్చడంలో ముందున్నారు. ఫలితంగా …. 65 శాతం ఉద్యోగార్థులు ఈ పరీక్షల్లో విజయం సాధించారు.తమకు దొరికిన అవకాశాన్ని వినయోగించుకుని విజయం సాధించారు. తమ విజయానికి ఇతోధికంగా సాయపడ్డ బాజిరెడ్డి గోవర్దన్, బాజిరెడ్డి జగన్‌లను నిజామాబాద్‌లోని తమ నివాసంలో వారంతా కలిసి ధన్యవాదాలు తెలిపారు. కేట్ కట్ చేసి తినిపించి తీపి కబురును చెప్పారు. తమకు తోడుగా నిలిచి అన్ని విధాలా అండగా ఉన్నందుకు ఆత్మీయంగా కలిసి వారితో కలిసి ముచ్చటించారు.
డిచ్ పల్లి 7th బెటాలియన్ పోలీస్ క్యాంప్ లో ఉచితంగా నిర్వహించిన బాజిరెడ్డి కోచింగ్ సెంటర్ ద్వారా 65 మంది ఉత్తీర్ణత సాదించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. 65 మంది కానిస్టేబుల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించగా… నలుగురు SI విద్యార్థులు క్వాలిఫికేషన్ పొందారు…మొత్తం కోచింగ్ తీసుకున్న విద్యార్థుల్లో 65 శాతం సక్సెస్ సాధించి తమ పట్టుదలను, ఉద్యోగం పై ఉన్న కమిట్మెంట్ను నిరూపించుకున్నారు. ఉచిత కోచింగ్ సెంటర్ సేవలను వినియోగించుకుని విజయతీరాలకు చేరారు.
బాజిరెడ్డి గోవర్ధన్ గారు మాట్లాడుతూ.. ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులను ఎమ్మెల్యే గారు అభినందించారు, కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని, మీ యొక్క ఉత్తీర్ణత దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
అనంతరం యువ నాయకులు బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ… బాజిరెడ్డి కోచింగ్ సెంటర్ ద్వారా, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ముందుగా అభినందనలు తెలియజేశారు, మేము ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ ను సద్వినియోగం చేసుకొని, మంచి క్రమశిక్షణతో కోచింగ్ సెంటర్ కు వచ్చి అనుభవంతులైన వారితో కోచింగ్ తీసుకొని ఇంతటి ఘన విజయాన్ని సాధించిన, యువతీ యువకులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కోచింగ్ డైరెక్టర్, డా. నీరడీ దినేష్ గారు, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.