యజమానిని మార్చుకున్న బూర

@@@

బానిసత్వ పరీక్షలో ఫెయిలయ్యా …బీజేపీలో చేరాక ఊదిన బూర

ఇంత అమాయకంగా ఉన్నత విద్యావంతులు కూడా ఎలా ఉంటారో నాకు అర్ధం కాదు. ఇప్పుడు బీజేపీ ఆయన్నేమైనా మహారాజును చేసిందా? పదవీమకుటధారిని చేసిందా?

ఇంతకన్నా శక్తివంతులైన నాయకులు…అనేక సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన డీకే అరుణ, కేంద్రమంత్రిగా పదేళ్లు చేసిన పురందేశ్వరి, బోలెడంత సినిమా గ్లామర్, మాజీ ఎంపీగా పనిచేసిన అనుభవం కలిగిన విజయశాంతి…వీళ్ళు పదేళ్లుగా వెట్టిచాకిరీ, బానిసత్వం చేస్తున్నా బీజేపీ అగ్రనేతలు వారి ముఖాలను కూడా చూడటం లేదు. వేలకోట్లాధిపతి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పత్రికను, ఛానెల్ ను చేతిలో పెట్టుకున్న వివేక్ లకు ఏమి సత్కారాలు జరిగాయి?

పార్టీ మారడం ప్రజాస్వామిక హక్కు. కానీ అది హుందాగా ఉండాలి.

బూర నర్సయ్యను చూస్తుంటే జాలివేస్తుంది. ఆరెస్సెస్ నేపధ్యం ఉన్నవారికే బీజేపీలో గుర్తింపు లభిస్తుంది. అది కూడా కొద్దిమందికే. ఇతరపార్టీల్లో పదవులు, అధికారం అనుభవించి అవకాశవాదంతో బీజేపీలో చేరినవారికి ఎలాంటి గుర్తింపూ దక్కదని అనుభవాలు తెలియజేస్తున్నాయి.

ముర‌ళీమోహ‌న రావు ఇల‌పావులూరి