స‌మ‌యం వ‌చ్చింది కాబ‌ట్టి బీసీ ఎజెండా గుర్తొస్తుంది. బీసీల‌కు తెగ అన్యాయం జ‌రిగిన విష‌యం ఆక‌స్మాత్తుగా స్పుర‌ణ‌కు వ‌స్తుంది. సీఎం బీసీల‌కు అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదనే అంశం స‌రిగ్గా ఉప ఎన్నిక స‌మ‌యంలో … ప‌ద‌వి కోసం పాకులాడుతున్న స‌మ‌యంలో ఇచ్చిన బ‌రోసా త‌ర్వాతే యాదికి వ‌స్తుంది. అంతే లీడ‌ర్లు కొంద‌రు ఇంతే. కులం పేరు చెప్పుకుని అలా బ‌తికేస్తారు. కుల సంఘం అంటారు. త‌న‌కు న్యాయం జ‌రిగితే ఆ కులానికంత‌టికీ న్యాయం జ‌రిగిన‌ట్టే అంటారు. త‌నకు ప‌ద‌వి ఇస్తే త‌న జాతి మొత్తం వెలిగిపోతుంద‌ని బీరాలు ప‌లుకుతారు. వాస్త‌వానికి బాగుప‌డేది ఒక్క‌డే. ప‌ద‌వి అనుభ‌వించేదీ ఈ ఒక్క‌డే. అలాంటి లిస్టులో తాజాగా చేరాడు బూర న‌ర్స‌య్య గౌడ్.

పైకి మేథావిన‌నే బిల్డ‌ప్‌. వైద్యుడ‌ననే క‌టింగ్‌, బీసీన‌నే సాకు.. ఇవ‌న్నీ ఎందుకు..? ప‌ద‌వి కావాలి. అది లేక‌పోతే ఉండ‌టం క‌ష్టం. ఎంపీగా గెలిచి ద‌ర్పం ప్ర‌ద‌ర్శించి అధికారం అనుభ‌వించిన అనుభూతి ఇంకా వీడ‌లేదు. ఓడినా అధికార దాహం తీర‌లేదు. ఉప ఎన్నిక రూపంలో ఎమ్మెల్యే ఆశ పుట్టింది. ట‌క్కున బీసీ కార్డు ఒక్క‌టి పైకెత్తాడు. కానీ అక్క‌డ ప‌ప్పులుడ‌క‌లేదు. ఇదే మోఖా అనుకున్నాడు. బీజేపీ పంచ‌న చేరాడు. ఏదో ఇస్తారులే… ఈ స‌మ‌యంలో చేరితో త‌న‌కు ప‌ద‌వి రాక‌పోతుందా అనే అత్యాశ‌. ప‌ద‌వి కోసం అప్ప‌టి వ‌ర‌కు నోర్ముసుకున్న ఈ బూర‌… అదే ప‌ద‌వి కోసం ఇప్పుడు ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడేస్తాడు.

పైగా త‌న‌కో వ్య‌క్తిత్వ‌ముందంటాడు. కానీ త‌న ఫేస్‌బుక్కు పేజీలో మాత్రం ఇంకా ఎంపీ అని అలాగే తోక ఒక‌టి ఉంచేసుకుంటాడు. ఇదొక్క‌డి చాల‌దా..? అత‌ని ప‌ద‌వీకాంక్ష ఏపాటిదో. త‌న‌కు ప‌ద‌వులు వ‌ద్ద‌ని,ప‌ద‌వుల కోసం రాజ‌కీయాల్లోకి రాలేద‌ని ఈ బూర బీరాలు ప‌లుకుతుంది. నీతుల వ‌ల్లెవేస్తుంది. ఆచ‌ర‌ణ‌లో ఈ బూర ఉత్త డొల్ల అని, పైకి మేథావి, విద్యావంతుడ‌న‌నే ముసుగేసుకుని ప‌ద‌వి కోసం పాకులాడే ఓ సాధాసీదా గ‌ల్లీ లీడ‌ర్ లెవ‌ల్ అని త‌న‌కు త‌ను తేల్చేసుకున్నాడు. తేలిపోయాడు. ఇలా….

You missed