ప్రతీ ఇంట్లో ఏదో ఒక విధంగా ప్రభుత్వ సంక్షేమ పథక లబ్దిదారులుంటున్నారు. ఒకరికి ఆసరా వస్తే .. మరొకరికి కళ్యాణలక్ష్మీ, మరొకరికి షాదీ ముబారక్.. చాలా మందికి రైతు బందు…. మరికొందరికి రైతు బీమా… సీఎంఆర్ఎఫ్…దళితబంధు… ఇలా ఏదో ఒక రూపంలో ప్రతీ ఇంట్లో ప్రభుత్వం అందించే పథకాల ద్వారా లబ్దిపొందిన వారే. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక వేడి రాజుకుంది. అందరి దృష్టి దాని మీదే ఉంది. టీఆరెస్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు తమకు అప్పగించిన బాధ్యతల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. రొటీన్ ప్రచారం కాకుండా కొంత మంది నేతలు భిన్నంగా ప్రచారం నిర్వహించడం అక్కడి ప్రజల్నే కాదు.. రాష్ట్ర ప్రజలనూ ఆకట్టుకుంటున్నది. మొన్న తాటికొండ రాజయ్య తను చేసే వైద్య వృత్తికి న్యాయం చేస్తూ ప్రచారంలో ఆ పాత్రకు ప్రాణం పోశాడు. కేవలం ప్రచారానికే పరిమితం కాలేదు. వైరల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు తను స్వయంగా చికిత్స అందించాడు. తనలోని వైద్యుడిని ఆ సందర్బంగా అలా వినియోగించుకుని ప్రజలకు మేలు జరిగే పని చేపట్టాడు. ఇప్పుడు ఎమ్మెల్యే రసమయి కూడా … కొంత భిన్నంగానే ప్రచారం చేస్తున్నాడు. ప్రతీ ఇంట్లో .. కేసీఆర్ ప్రభుత్వ ఫలాలు పొందిన వారున్నారు… ప్రతీ ఇంటి గోడకూ కేసీఆర్ ఫోటో .. అంటూ తనే స్వయంగా వాల్‌పోస్టర్‌ను అంటించి … టీఆరెస్ అభ్యర్థి కూసుకుంట్లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాడు.