టీఆరెస్ నాయకుల తీరుతో, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో మరోనేత తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. తను రాజకీయాల నుంచి స్వచ్చందంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. మానస గణేశ్. కింద స్థాయి నుంచి ఎదిగిన బీసీ బిడ్డ. విద్యావంతుడు. మానన విద్యా సంస్థల అధినేత. రజక సామాజికవర్గానికి చెందిన వాడు. రజక సంఘాల ఐక్య సమితికి రాష్ట్ర కన్వీనర్. అత్యంత వెనుకబడిన తరగతి ఎంబీసికి జిల్లా కన్వీనర్‌గా వ్యవహరించాడు. తన సొంత డబ్బు లక్షల రూపాయలకు వారి కోసం కుమ్మరించాడు. ఇంకా వారి సంక్షేమం కోసం ఏదో చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన హామీలతో టీఆరెస్ పార్టీలో చేరాడు.
కానీ, ఓడెక్కేదాక ఓడ మల్లన్న.. ఓడ దిగినాక బోడి మల్లన్న అన్న చందంగా అటు జీవన్ రెడ్డి.. ఇటు కవిత ఎవరూ పట్టించుకోలేదు. తిరిగి తిరిగి చెప్పులరిగి, ఆస్తులు కర్పూరంలా కరిగి ఇక చాలు.. ఈ రాజకీయాలు అని నిశ్చయించుకున్నాడు. వీళ్లను నమ్ముకుని అధోగతి పాలైన తన విద్యాసంస్థలను చక్కదిద్దుకునే పనిలో లీనమయ్యాడు. రాజకీయాలు వద్దు.. మీ హామీలు వద్దు.. మీరూ వద్దు.. నన్నిలా వదిలేయండి… నాను చేతనైంది ప్రజలకు సేవ చేస్తా.. మీ సాయం వద్దు.. మీ సపోర్టూ వద్దంటున్నాడు…!!