ఆయ‌న ఆర్మూర్ ఎమ్మెల్యే. ఆశ‌న్న‌గారి జీవ‌న్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా అధ్య‌క్షుడు కూడా. మ‌రొక‌రు జ‌డ్పీ చైర్మ‌న్. దాదాన్న‌గారి విఠ‌ల్ రావు. ఈయ‌న‌ది మాక్లూర్‌. ఎమ్మెల్యేకు, జ‌డ్పీ చైర్మ‌న్‌కు మధ్య తీవ్ర అగాథం ఏర్ప‌డింది.చైర్మ‌న్ త‌న‌ను కాద‌ని కార్య‌క్ర‌మాలు పెట్టుకుంటున్నాడ‌ని ఎమ్మెల్యే అల‌క‌. పైగా ఎవ‌రూ ఆయ‌న మీటింగుల‌కు పోవ‌ద్ద‌ని కూడా ఎమ్మెల్యే గులాబీ నేత‌ల‌కు వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్‌…. కాస్త ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే దాకా వెళ్లింది. చాల వేదిక‌ల్లో బ‌హిరంగంగానే జ‌డ్పీ చైర్మ‌న్.. జీవ‌న్ రెడ్డి వ్య‌వ‌హార శైలిపై విరుచుకుప‌డ్డాడు. ఇదేం దోర‌ణి అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఇంత చేసినా.. పెద్ద‌లు జోక్యం చేసుకున్నా.. జీవ‌న్ రెడ్డి మార‌లేదు. అదే గ్యాప్ మెయింటేన్ చేస్తున్నాడు.

మొన్న‌టికి మొన్న మాక్లూర్ సాక్షి విలేక‌రి పోశెట్టిపై ఆర్మూర్ ఎమ్మెల్యే అనుచ‌రులు దాడి చేశారు. త‌మ‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాస్తున్నాడంటూ హ‌త్యాయ‌త్నానికి ఒడిగ‌ట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించింది. దీనిపై పెద్ద‌లు సీరియ‌స్ అయ్యారు. కానీ, జ‌డ్పీ చైర్మ‌న్ మాత్రం బాధితుడికి అండ‌గా నిలిచాడు.ఇది ఎమ్మెల్యే దుశ్చ‌ర్య‌గా తీవ్రంగా ఖండించాడు. ఆ త‌ర్వాత ఎలాగోలా ఎమ్మెల్యే ఈ ఇష్యూను స‌ద్దుమ‌ణిగేలా చేశాడు. అప‌సోపాలు ప‌డ్డాడు. అయితే తాజాగా కొత్త ఆస‌రా పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మాలు అన్ని చోట్ల జ‌రుగుతున్నాయి. ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గంలో మొన్న స్టార్ట్ అయ్యాయి. దీనికి జ‌డ్పీ చైర్మ‌న్‌కు పిలుపు లేదు.

త‌న మండ‌ల కేంద్రంలో ప్రోగ్రాం జ‌రిగినా ఎమ్మెల్యే నుంచి చైర్మ‌న్‌కు పిలుపు రాలేదు. ఎవ‌రో అధికారి చెప్పాడు.. ఈ రోజు ప్రోగ్రం ఉంది స‌ర్‌.. రండి.. అని. జ‌డ్పీ చైర్మన్ అదే పిలుపును అందుకుని ప్రోగ్రాంకు వెళ్లాడు. ఈ కార్య‌క్ర‌మంలో కూడా ఇద్ద‌రూ ఎడముఖం పెడ‌ముఖం. మ‌ళ్లీ ఈ రోజు నందిపేట్ సేమ్ ప్రోగ్రాం. సేమ్ సిచ్యూవేష‌న్‌. జ‌డ్పీ చైర్మన్‌కు పార్టీ త‌ర‌పున‌, ఎమ్మెల్యే త‌ర‌పున పిలుపు లేదు. ఓ అధికారి ఏదో చెప్పాడా అంటే చెప్పాడు అన్న చందంగా… రండి సార్ ..! అని ఫోన్ పెట్టేశాడు. అయినా చైర్మ‌న్ ప్రోగ్రాంకు వెళ్లాడు. ఇదీ సంగ‌తి..!!

You missed