కేసీఆర్ ఎప్పుడూ అటూంటాడు. మీకు చెప్పేందుకు ఏమీ లేదు. ఎందుకంటే చేసిందేమీ లేదు కాబ‌ట్టి. నిధులివ్వ‌రు. ఓ ప‌థ‌కం ఉండ‌దు. అన్నీ ఫ్రీ ప‌బ్లిసిటీ… అందులో మా వాటా.. ఇందులో మా వాటా అంటూ కాలం గ‌డ‌పడం….

అవును ఇది నిజ‌మే అనిపిస్తుంది చాలా సార్లు జ‌నానికి. ఎందుకంటే రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా బీజేపీ చేసిందేమీ లేదు. అందుకే రాష్ట్రంలో వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు, మ‌త‌త‌త్వ వ్యాఖ్య‌లు, రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలుంటాయి. కేంద్ర మంత్రులు కూడా ఇదే పోక‌డ‌. వాళ్ల‌కూ పాపం చెప్పేందుకు ఏమీ ఉండ‌వు. ఏవో నాలుగు దేశ‌భ‌క్తి , సెంటిమెంట్‌, మోడీ హీరో… లాంటి నాలుగు మాట‌లు చెప్పి మ‌ళ్లీ మోడీ స‌ర్కార్ వ‌స్తుంద‌ని జోస్యం చెప్పి బ‌య‌ట‌ప‌డ‌ట‌మే. అచ్చంగా అలాగే జ‌రిగింది హైద‌రాబాద్‌లో ఓ మీటింగు ఇవాళ‌.

ఆయ‌న కేంద్ర సామాజిక న్యాయం, సాధికార‌త శాఖ మంత్రి. రామ్‌ధాస్ అథ‌వాలే. ఎస్సీ, బీసీ శాఖ‌ల అధికారుల‌తో చిన్న మీటింగు పెట్టుకుని ఆ త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చాడు. ఏమైనా కొత్త విష‌యాలు చెప్పాడా..? నిధులేమైనా ఇచ్చామ‌ని ప్ర‌క‌టించాడా..? ఎస్సీ, ఎస్టీల‌కు ఏమేం చేశామో వివ‌రించాడా..? ఇంకా ఏమైనా చేస్తాడేమో చెప్పాడా..? వాళ్ల జీవితాలు ఏమైనా బాగుప‌ర్చే విష‌యంలో ఇన్నేండ్లు ఏమేం చ‌ర్య‌లు తీసుకున్నామో మీడియా ముందుంచాడా..?? ఉహు. ఏమీ లేదు. అస్స‌లు ఈ అంశాల జోలికే పోలేదు. మ‌రేం చెప్పాడు. అంత‌దూరం నుంచి వ‌చ్చి. అని అనుకుంటున్నారా..?

పాకిస్తాన్ పై ఇండియా గెలిచింది. ఫీల్డింగు మంచిగుంది. బోలింగ్ మంచిగుంది. రేపు పాకిస్తాన్ తో యుద్దం వ‌చ్చినా మ‌నమే గెలుస్తాం. మోడీ నెంబ‌ర్ వ‌న్. అసోంటి ప్ర‌ధాని ఏడా లేడు. మ‌రేడా ఉండ‌డు…. నిజం.. ఒట్టు్ అనే మాట‌లు మాట్లాడి వెళ్లిపోయాడు. ఇదీ మ‌న కేంద్ర‌, రాష్ట్ర బీజేపీ నేత‌ల స‌బ్జెక్ట్ ఓరియెంటెడ్ మీటింగులు, స్పీచులు……..

You missed