హైదరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లి ఏయిడెడ్ కో-ఆపరెటీవ్ హౌజింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల వ్యవహారంపై తీర్పు చెప్పి, ఎంతోకాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన సుప్రీం కోర్టు తాజా మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారిని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయుడబ్ల్యుజె). ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) నాయకులు కలిసి హైదరాబాద్ జర్నలిస్టుల పక్షనా కృతజ్ఞతలు తెలిపారు. శనివారం నాడు ఎన్వీ రమణ గారిని ఢిల్లీ లోని క్రిష్ణ మీనన్ మార్గ్ లో గల ఆయన నివాసంలో టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డిలుఆయ‌న‌ను క‌లిసి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇవ్వాళ ఎన్వీ రమణ గారి జన్మదినం కూడా. ఈ సంద‌ర్బంగా టీయుడబ్ల్యుజె, ఐజేయూ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ కృత‌జ్ఞ‌త అంటే. ఎన్నో ఏళ్లుగా .. అస‌లు వ‌స్తాయా..? రావా..? అని ఆశ‌లు చాలించుకుని దీనంగా ఎదురుచూస్తున్న 1200 మంది జ‌ర్న‌లిస్టుల‌కు తీపి క‌బురు చెప్పారు ఎన్వీ ర‌మ‌ణ‌. కానీ ఇదంతా మా క్రెడిట్ అంటే మా క్రెడిట్ అని.. కేసీఆర్ జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఓ దీపం లాంటి వాడ‌ని మ‌న జ‌ర్న‌లిస్టులు ఎవ‌రికి వారే ఢంకా బ‌జాయించుకుంటున్నారు. అయినా తెలంగాణ వ‌చ్చిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర్న‌లిస్టుల‌ను ప‌ట్టించుకున్న‌దెవ‌రు..? వారికి ఒన‌గూరిందేమిటీ..? ఆ కుటుంబాలు బాగుప‌డ్డ‌దెప్పుడు…? ఇవ‌న్నీ మ‌న యూనియ‌న్ నేత‌ల‌కు.. కేసీఆర్ పై స్వామి భ‌క్తి చూపుతూ ఆర్టిక‌ల్ రాసే మేథావి జ‌ర్న‌లిస్టుల‌కు తెలియ‌దా..? అంద‌రికీ తెలుసు. కానీ నోరు మెద‌ర‌పు. ఇలాంటివి జ‌రిగితే మాత్రం అవి మ‌న ఖాతాలో వేసుకుని మీలాంటి వీరులు లేరు.. మీరు లేక‌పోతే మా బ‌తుకులే లేవు.. అనే రేంజ్‌లో క‌టింగులు ఇచ్చుకుని వారి సీట్లు.. ఓట్లు కాపాడుకుని నాలుగు రాళ్లు వెన‌కేసుకుంటారు జ‌ర్న‌లిస్టు కులాన్ని అడ్డంపెట్టుకొని.